టాలీవుడ్, కోలీవుడ్, కన్నడ, సీతా రామం తో మలయాళంలోకి అడుగుపెట్టి సక్సె ఫుల్ హీరోయిన్ గా మారిన రష్మిక బాలీవుడ్ లో మాత్రం హిట్ కోసం ఫైట్ చేస్తుంది. అక్కడ వరస సినిమాలు చేస్తున్నా, క్రేజీ తారలతో నటిస్తున్నా రశ్మికకి మాత్రం సక్సెస్ రావడం లేదు. తాజాగా యానిమల్ చిత్రంతో రష్మిక అదృష్టాన్ని పరిక్షించుకోబోతుంది. సందీప్ రెడ్డి వంగా దర్హకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రాబోతున్న యానిమల్ డిసెంబర్ 1 న విడుదల కాబోతుంది.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో రష్మిక చాలా క్యూట్ గా శారీస్ తో బ్యూటిఫుల్ లుక్స్ తో కనిపిస్తుంది. రణబీర్, సందీప్ రెడ్డి వంగాతో కలిసి రష్మిక యానిమల్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. రీసెంట్ గానే అన్ స్టాపబుల్ టాక్ షోకి హాజరైన రష్మిక ఆ షోలో బ్లాక్ శారీ తో మెస్మరైజ్ చేసింది. ఇక ఇప్పుడు లైట్ కలర్ శారీ లో మరోసారి అదరగొట్టేసింది. లైట్ పింక్ శారీ లో రష్మిక నిజంగా అందంగా, గ్లామర్ గా మెరిసిపోతూ కనిపించింది. కొద్దిరోజులుగా రష్మిక యానిమల్ మూవీ ప్రమోషన్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ కనిపిస్తుంది.