అందం లేకపోయినా టాలెంట్ ఉంటే టాప్ రేంజ్ కి చేరుకోవచ్చు అని నిరూపించిన స్టాండప్ కమెడియన్ ఫైమా. ఆమెకి అందంలేదు, అలాగని బ్యాగ్రౌండ్ కూడా లేదు. పేద కుటుంబం నుంచి వచ్చి జబర్దస్త్ లో కామెడీ చేస్తూ పేరు తెచ్చుకుంది. జబర్దస్త్ లో ఫైమా కామెడీకి స్పెషల్ కామెడీ ఆడియన్స్ ఉన్నారు. జబర్దస్త్ లో భాస్కర్ స్కిట్స్ లో కామెడీ చేసే ఫైమా తర్వాత స్టార్ మా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ లో తనకన్నా పేరున్న కంటెస్టెంట్స్ ని వెనక్కి నెట్టి మరీ ఆల్మోస్ట్ టాప్ 5 వరకు చేరుకుంది.
జబర్దస్త్ లో కామెడి టాలెంట్, బిగ్ బాస్ లో విల్ పవర్ ని స్ట్రెంత్ ని చూపించిన ఫైమా బిగ్ బాస్ నుంచి బయటికొచ్చాక సూర్య తో కలిసి డాన్స్ షో BB జోడిలో తనలోని మరో టాలెంట్ ని చూపించింది. ఇక స్టార్ మా బిగ్ బాస్ కి సంబంధించి ఏడాది అగ్రిమెంట్ పూర్తవడంతో మళ్ళీ జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ కామెడీ చేస్తుంది. కామెడీ షోలో ఈసారి మరింత ఎనెర్జీ చూపిస్తుంది.
అయితే ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఫైమా సడన్ గా ఆసుపత్రిలో సెలైన్ పెట్టించుకుని ఉన్న వీడియో ని తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది. చేతికి సెలైన్ తో డల్ కనిపించింది ఫైమా. అయితే ఆ వీడియో ని షేర్ చేసిన ఫైమా అసలెందుకు ఆసుపత్రిలో జాయిన్ అయ్యిందో చెప్పలేదు కానీ.. ఆ వీడియోలో కాస్త నీరసంగా కనిపించింది. మరి ఫైమా కి ఏం హెల్త్ ఇష్యు ఉందొ కానీ.. ఆమె అభిమానులు మాత్రం ఆమె త్వరగా కోలుకోవాలి అంటూ కోరుకుంటున్నారు.