ఈ వారం బిగ్ బాస్ నుంచి డబుల్ ఎలిమినేషన్ అంటూ నాగార్జున గత వారమే చెప్పి వెళ్లారు. గత వారం ఎలిమినేషన్ ని స్కిప్ చేసి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పారు. ఇక ఈ శనివారం కింగ్ నాగార్జున గరం గరంగా వచ్చేసారు. ఎప్పటిలాగే నాగ్ హౌస్ మేట్స్ ని క్లాస్ పీకినట్టే కనిపించారు. అందులో ముందుగా పల్లవి ప్రశాంత్ ని లేపి నువ్వు టాస్క్ లో చనిపోయి ఘోస్ట్ అయ్యాక ఆ బూతులేమిటి అని అడిగారు. దానికి పల్లవి ప్రశాంత్ నుంచుని సైలెంట్ గా ఉన్నాడు. దానితో నాగ్ మాట్లాడు ప్రశాంత్ నామినేషన్స్ లో ఇలా అలా అంటావ్ గా అంటూ పల్లవిని ఇమిటేట్ చేసారు.
ఇక గౌతమ్ , అశ్విని లు బూతుల వల్ల ఇబ్బంది పడిందిఅంటూ గౌతమ్, అశ్వినిని నించోమన్నారు. అమ్మా అశ్విని ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని తెలుసుగా.. ఎందుకు సెల్ఫ్ నామినేషన్ వేసుకున్నావ్, కాన్ఫిడెన్సా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సా అంటూ అడిగారు. దానికి అశ్విని సర్ అంటూ కాస్త మెలికలు తిరిగింది. అయితే ఈవారం మొదటి నుంచి ఓటింగ్ లో అశ్విని చివరి ప్లేస్ లో డేంజర్ జోన్ లో ఉంది. డబుల్ ఎలిమినేషన్ లో ముందుగా అశ్వినిని ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ వుంది.
అదే విషయాన్ని నాగార్జున ఈ శనివారం ఎపిసోడ్ లో హింట్ చ్చినట్టుగా ప్రోమో చూస్తే తెలుస్తుంది. మరి ఈ వారం అశ్విని పక్కాగా ఎలిమినేట్ అవడం ఖాయమనిపిస్తుంది.