యంగ్ హీరోల తో సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుని సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తో భగవంత్ కేసరి చిత్రంతో అనిల్ రావిపూడి పేరు మరింతగా మార్మోగిపోయింది. ఆయన కేరీర్లో అయన తెరకెక్కించిన సినిమాలన్ని యావరేజ్ టాక్ తోనే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. భగవంత్ కేసరి చిత్రం సక్సెస్ తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తారో అనే క్యూరియాసిటీ మొదలయ్యింది.
అయితే అనిల్ రావిపూడి బాలయ్య తర్వాత మరో సీనియర్ హీరో మెగాస్టార్ చిరు తో సినిమా చెయ్యాలనే కోరికతో ఉండడమే కాదు.. ఇప్పటికే చిరుతో ప్రాజెక్ట్ డిస్కర్షన్స్ మొదలయ్యాయట. ఆ చర్చలు ఇప్పటికే ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయని.. దిల్ రాజు కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇస్తే ఆల్మోస్ట్ మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడిల కాంబో మూవీ సెట్టయినట్లే అంటున్నారు. అంటే మెగాస్టార్ ఇప్పుడు వసిష్ఠ తో మెగా 156 మొదలు పెట్టారు.
ఆ మూవీ తో పాటుగా మెగాస్టార్ చిరు అనిల్ రావిపూడి మూవీ కూడా పట్టాలెక్కించి ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ మూవీ విషయంలో పూర్తి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి అనిల్ రావిపూడి మెగాస్టార్ కోసం అయితే కొద్దిగా వెయిట్ చెయ్యాల్సిందే.