కన్నడ కాంతార విడుదలైన అన్ని భాషల్లో ప్రభంజనం సృష్టించింది. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ తో మేకర్స్ ని లాభాలలో ముంచెత్తింది. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా వచ్చిన కాంతారని విడుదలైన అన్ని భాషల్లో పేక్షకులు ఆదరించారు. దానితో రిషబ్ శెట్టి కాంతార కి సీక్వెల్ కాదు ప్రీక్వెల్ తెరకెక్కిస్తాను అంటూ అందరిలో ఆశక్తిని, అంచనాలను క్రియేట్ చేసి గత ఏడాదిగా ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా వున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది.
తాజాగా కాంతార నుంచి బిగ్ అప్ డేట్ బయటికి వచ్చింది. అది నవంబర్ 27 న కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్టుగా రిషబ్ శెట్టి ప్రకటించాడు. నిన్నమొన్నటివరకు చడీ చప్పుడు లేని కాంతార నుంచి ఇప్పుడు ఫస్ట్ లుక్ అంటూ ఒక్కసారిగా అందరిలో అంచనాలు పెంచేవారు. కాంతార ఫస్ట్ లుక్ తోనే అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రిషబ్ శెట్టి ఈసారి ఈ ప్రీక్వెల్ ఫస్ట్ లుక్ ఎలా డిజైన్ చేసాడో అనే ఆత్రుత అందరిలో మొదలైంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేల్ల నటిస్తుంది.