ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని 100 కోట్ల హీరోయిన్ అనిపించుకున్న శ్రీలీల కి మళ్ళీ ఆ రేంజ్ హిట్ దొరకలేదు. భగవంత్ కేసరితో హిట్ అందుకున్నా.. ఆ సక్సెస్ లో మేజర్ పార్ట్ బాలయ్య పట్టుకెళ్ళిపోయారు. ఇక శ్రీలీల ధమాకా తర్వాత నటించిన స్కంద, ఇప్పుడు ఆదికేశవ రెండు సినిమాలు పాపకి భారీ షాకిచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా మారబోతున్న శ్రీలీలని వరస ప్లాప్ లు పలకరిస్తున్నాయి. శ్రీలీల అటు నటన పరంగాను, ఇటు డాన్స్ లతోనూ చాలా కష్టపడుతుంది.
అలాగే అందంగా, గ్లామర్ గా కనిపించే శ్రీలీల లుక్స్ వైజ్ గా క్యూట్ గా ఆకట్టుకుంది. మల్టీ షేడ్స్ ఉన్నా శ్రీలీల కష్టం ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరుగా మిగిలిపోతుంది. డాన్స్ లతో హుషారుగా హోరెత్తిస్తున్న శ్రీలీల కి సక్సెస్ ఇప్పుడు దూరమవుతుందా అనిపించేలా ఉంది. స్కంద లోను రామ్ తో కలిసి అదిరిపోయే స్టెప్స్ వేసిన శ్రీలీల.. ఆదికేశవలోను వైష్ణవ తేజ్ ని మించి డాన్స్ చేసింది. ఆదికేశవలో ఆమె డాన్స్ స్టెప్స్ ఇంకా ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అసలు హీరోయిన్ ని చూసి టికెట్స్ తెగే రోజులిచ్చాయనే కామెంట్స్ కూడా చేసారు.
కానీ ఇప్పుడు శ్రీలీల కష్టం కనిపించినా సినిమాలు హిట్ అవ్వడం లేదు. స్కంద రొటీన్ యాక్షన్ మూవీగా ప్లాప్ లిస్ట్ లోకి వెళ్లగా.. ఆదికేశవ ని కూడా రొటీన్ రోడ్డకోట్టుడు అంటూ ప్రేక్షకులు తేల్చేసారు. ఎమోషన్స్ లేవు, కథ, కథనం అన్ని రొటీన్ గా ఉండడంతో శ్రీలీల-వైష్ణవ తేజ్ జోడి బాగున్నా ఆదికేశవ సినిమాకి ప్రేక్షకులు డివైడ్ టాక్ ఇవ్వడంతో ఈ చిత్రం కూడా షెడ్డుకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఇవన్నీ చూస్తుంటే శ్రీలీల కష్టం బూడిదలో పోసిన పన్నీరులా బుగ్గిపాలైయిపోతుంది అనిపించేలా ఉంది. మరి రేపు రాబోయే ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీ ఏం చేస్తుందో చూడాలి.