హీరో నాని - మృణాల్ ఠాకూర్, శృతి హాసన్ కాంబోలో డిసెంబర్ 7 న రాబోతున్న హాయ్ నాన్న మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి. ప్యాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని నాని విడుదలయ్యే ప్రతి భాషలో భారీగా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాడు. తాజాగా మేకర్స్ హాయ్ నాన్న ట్రైలర్ ని విడుదల చేసారు. తండ్రి-కూతురు అనుబంధంతో ఈ ట్రైలర్ కట్ ఉంది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో నాని రొమాన్స్ అన్ని ట్రైలర్ లో హైలెట్ అయ్యాయి.
తన కూతురుతో జర్నీ చేస్తూ.. తల్లి గురించి నిజం చెప్పకుండా నాన్న కథలతో కాలక్షేపం చేస్తూ చివరికి తల్లి కథ చెబుతా అంటూ తన తల్లి స్థానంలో పాప మృణాల్ ని ఊహించుకోవడం ఇవన్నీ ఆడియన్స్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తున్నాయి. కూతురిపై ప్రేమ, కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాగా హాయ్ నాన్నపై ఈ ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఇక ఓ షాట్ లో మరో హీరోయిన్ శృతి హాసన్ ని మొదటిసారిగా పరిచయం చేసారు. మృణాల్ లుక్స్, నాని డిఫ్రెంట్ లుక్ ఆకట్టుకుంటున్నాయి.
కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి హేషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించాడు. హాయ్ నాన్న కి మరో మెయిన్ ఎస్సెట్ గా సినిమాటోగ్రఫీ నిలుస్తుంది.