మెగా హీరో వైష్ణవ తేజ్-బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల కలయికలో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ లో తెరకెక్కిన ఆదికేశవ ఈరోజు నవంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివోషనల్ టచ్‌తో రూపొందిన ఈ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేడు విడుదలైన ఈ చిత్ర డిజిటల్ హక్కుల కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. అందులో భాగంగానే ఆదికేశవ చిత్ర ఓటిటీ హక్కులని ఓ ప్రముఖ ఓటిటీ సంస్థ చేజిక్కించుకుంది.
ఈరోజు విడుదలైన ఆదికేశవ మూవీ టైటిల్స్ లోనే ఆ ఓటిటీ సంస్థ పేరుని రివీల్ చేసారు. ఆదికేశవ మూవీని నెట్ ఫ్లిక్స్ భారీ డీల్ తో చేజిక్కించుకుంది. సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని తెలుస్తుంది. నవంబర్ 24వ తేదీన విడుదలైన ఆదికేశవ చిత్రం డిసెంబర్ చివరి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ వినిపిస్తోంది.