ప్రభాస్ ఫాన్స్ ఇప్పుడు ఎంతో ఆకలితో కనిపిస్తున్నారు. రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు వారిని బాగా డిస్పాయింట్ చెయ్యడంతో రాబోయే సలార్ పై ఆశలన్నీ పెట్టుకున్నారు. అయితే సలార్ కి సంబందించిన టీజర్ విషయంలో సోషల్ మీడియాలో కొన్ని విమర్శలొచ్చాయి. KGF మాదిరి ఉంది అంటూ కామెంట్స్ చేసారు. ఇక రాబోయే సలార్ ట్రైలర్ పైనే ఆశలన్నీ ఉన్నాయి. సలార్ ట్రైలర్ వచ్చాక ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు మారిపోయి అంచనాలు పెరిగిపోతాయని వారు ఆశగా ఎదురు చూస్తున్నారు.
అయితే నిన్న సందీప్ రెడ్డి వంగా నుంచి వచ్చిన యానిమల్ ట్రైలర్ చూసాక ఇలాంటి ట్రైలర్ కదా కావాల్సింది మనకి అనుకుంటున్నారు ప్రభాస్ ఫాన్స్. రణబీర్ కపూర్-రష్మిక కలయికలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో..
రణబీర్ మ్యాన్లీ లుక్స్ తో ఆకట్టుకున్నాడు
అనిల్ కపూర్-రణబీర్ కపూర్(తండ్రి-కొడుకుల) కాంబో సీన్స్ ఎమోషనల్ టచ్ ఇచ్చాయి,
రష్మిక లుక్స్ సటిల్ గా ఉన్నాయి,
టాప్ క్లాస్ ఎడిటింగ్,
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పవర్ ఫుల్ గా వినిపించింది,
యాక్షన్ పార్ట్ సీన్స్ గూస్ బంప్స్… అంటూ యానిమల్ ట్రైలర్ చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ చూసాక ప్రభాస్ ఫాన్స్ కూడా మా సలార్ ట్రైలర్ ఇంతకు మించి ఉండాలని కోరుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ స్పిరిట్ చెయ్యాల్సి ఉంది. ఇప్పటి నుంచే ఈ #Spirit హాష్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సందీప్ రెడ్డి-ప్రభాస్ కాంబోపై అంచనాలు మరింతగా పెంచేసింది.