అక్టోబర్ 19 దసరా సెలవలు క్యాష్ చేసుకునేందుకు నందమూరి బాలకృష్ణ తన కొత్త చిత్రం భగవంత్ కేసరిని విడుదల చేసారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తమిళం నుండి లియో తో గట్టి పోటీ ఎదురైంది. విజయ్ సినిమాలపై ప్రేక్షకుల ఇంట్రెస్ట్ ఎలా ఉన్నా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం అనగానే తెలుగు ప్రేక్షకులు కూడా లియో పై ఆసక్తి చూపించారు. భారీ ఓపెనింగ్స్ కట్టబెట్టారు. అయితే థియేటర్స్ లో ఒకే రోజు పోటీ పడిన భగవంత్ కేసరి, లియో మూవీస్ రెండిటిలో భగవంత్ కేసరికి యావరేజ్ టాక్ రాగా.. లియో కి ప్లాప్ టాక్ వచ్చింది.
లియో కి ప్లాప్ టాక్ రావడంతో భగవంత్ కేసరికి కలిసొచ్చి అద్భుతమైన కలెక్షన్స్ సాధించి హిట్ లిస్ట్ లోకి వెళ్ళిపోయి సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుంది. ఇక లియో కూడా డివైడ్ టాక్ తోనే ఇక్కడ తెలుగు హక్కులు కొన్నవారిని సేవ్ చేసింది. అప్పుడు థియేటర్స్ లో పోటాపోటీగా కనబడిన లియో, భగవంత్ కేసరిలు మళ్ళీ ఈరోజు నవంబర్ 24 న మరోసారి పోటీకి దిగాయి. అది కూడా ఓటిటిలో. భగవంత్ కేసరి అమెజాన్ ప్రైమ్ నుంచి ఈ రోజు అంటే నవంబర్ 24 నుండి స్ట్రీమింగ్ లోకి రాగా.. లియో నెట్ ఫ్లిక్స్ నుంచి నేడు ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చేసింది.
మరి థియేటర్స్ లో హోరాహోరీగా తలపడిన లియో-భగవంత్ కేసరిలు ఇక్కడ ఓటిటిలో ఏ మాత్రం ప్రభావం చూపుతాయో.. ఏ చిత్రానికి ఎక్కువ వ్యూస్ వస్తాయో అని ఇద్దరి హీరోల అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు.