బిగ్ బాస్ సీజన్ 7 ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. మరో నాలుగు వారాల్లో ఈ సీజన్ కంప్లీట్ అవ్వబోతుంది. హౌస్ లో ఇంకా పదిమంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో ఓ ఇద్దరు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో బయటికి వెళిపోనున్నారు. ఈ వారం నామినేషన్స్ లో శోభా శెట్టి, ప్రియాంక తప్ప మిగిలిన ఎనిమిదిమంది ఉన్నారు. చివరి వారాలు కావడంతో ఈ మూడు వారాల్లో ఎవరెవరు ఎలిమినేట్ అవుతారో అనే క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తుంది.
అమర్ దీప్, శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్, రతిక, అర్జున్, గౌతమ్, అశ్విని లు ఉన్నారు. అందులో పల్లవి ప్రశాంత్ తన దగ్గర ఏవిక్షన్ ఫ్రీ పాస్ ఉంచుకున్నాడు. ఇక ఈవారం ఓటింగ్స్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా టాప్ 5 లో కూడా ఉండడు అనుకున్న అమర్ దీప్ గ్రాఫ్ పెంచుకుని మొదటి స్థానంలో అంటే శివాజీ, పల్లవి ప్రశాంత్ ని వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ లో కనిపిస్తున్నాడు. ఇది శివాజీ, పల్లవి అభిమానులకి ఒకింత షాక్. బిగ్ బాస్ ఏడో సీజన్‌లో శివాజి, ప్రశాంత్, ప్రిన్స్ యావర్ టాప్ 5 కంటెస్టెంట్లు అని చాలామంది ఫిక్స్ అయ్యారు. దానితో ఈ ముగ్గురు ఎప్పుడు నామినేషన్స్ లో ఉన్నా వారికే ఎక్కువ ఓటింగ్ నమోదు అవుతూ వస్తోంది. కానీ ఈసారి అమర్ వారికి షాకిచ్చాడు.
అమర్ తర్వాత పల్లవి ప్రశాంత్, శివాజి, ప్రిన్స్ యావర్‌లు టాప్ 4 ప్లేసుల్లో ఉన్నారని తెలుస్తుంది. ఐదో స్థానం కోసం అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ మధ్య పోటీ ఉండగా.. అర్జున్, ఆ తర్వాత గౌతమ్ చాలా స్వల్ప ఓటింగ్ లో పోటీలో ఉన్నారు. రతిక ఏడో స్థానంలో, సెల్ఫ్ నామినేట్ చేసుకున్న అశ్విని ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా.. ఈ వారం డేంజర్ జోన్ లోకి రతిక-అశ్వినీ వచ్చారు. సో ఈ వారం ఈ ఇద్దరూ డబుల్ ఎలిమినేషన్ లోకి వెళ్లి హౌస్ ని వీడేటట్టుగా కనిపిస్తున్నారు.