అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ తో బిజీగా గడుపుతున్నాడు. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చేవరకు అల్లు అర్జున్ బిజీనే. పుష్ప పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లినా అల్లు అర్జున్ మాత్రం ప్యాన్ ఇండియా ప్రమోషన్స్ పైనే ఫోకస్ పెడతారు. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. అల్లు అర్జున్ పుష్ప తర్వాత త్రివిక్రమ్, సందీప్ వంగా, బోయపాటితో కమిట్ అయ్యాడు. అందులో అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోపైనే అందరి చూపు ఉంది.
తాజాగా ఈ చిత్రంపై బన్నీ వాస్ ఓ చిన్నపాటి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కలయికలో రాబోయే మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే ఏడాదిన్నర సమయం పడుతుంది అని, ఈ చిత్రం నేపథ్యం సోషియో ఫాంటసీ గా ఉండబోతుంది అని, ఇండియన్ సినిమాల్లోనే ఓ భారీ సినిమాగా వుంటుంది అంటూ బన్నీ వాస్ అల్లు అర్జున్-త్రివిక్రం మూవీపై క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈచిత్రం గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఉంటుంది.. ఒకవేళ ఈ లోగా బోయపాటి కథ రెడీ అయితే అల్లు అర్జున్ తో తివిక్రమ్ కన్నా ముందే బోయపాటి సినిమా వుండొచ్చు అంటూ ఆయన చెప్పారు.
మరి అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో ముందుకు వెళతారా లేదంటే.. బోయపాటితోనా అనేది ఇప్పుడు అల్లు ఫాన్స్ లో మొదలైన క్యూరియాసిటీ.