Advertisementt

హోరెత్తిన మెసేజులు.. స్పందించిన సూర్య

Thu 23rd Nov 2023 08:54 PM
suriya  హోరెత్తిన మెసేజులు.. స్పందించిన సూర్య
Suriya on his injury హోరెత్తిన మెసేజులు.. స్పందించిన సూర్య
Advertisement
Ads by CJ

ఈరోజు చెన్నై లో కంగువ షూటింగ్ స్పాట్ లో ప్రమాదానికి గురయిన సూర్య ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి వెళ్లినట్టుగా తెలుస్తుంది. కంగువ షూటింగ్ లో కెమెరా సూర్య పైన బలంగా పడడంతో సూర్య భుజానికి గాయమైనట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర బృందం సూర్యని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం ఇప్పించారు. సూర్య భుజానికి తగిలిన గాయం అంత పెద్ద గాయం కాదనే సమాచారం కంగువ నిర్మాతల నుంచి రావడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

సూర్య త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు దేవుణ్ణి ప్రార్ధించారు. సూర్యను పరీక్షించిన వైద్యులు ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారని తెలుస్తోంది. ఇక తనకి ప్రమాదం జరిగాక తాను త్వరగా కోలుకోవాలని ప్రార్దించిన ప్రతి ఒక్కరికి సూర్య సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు.. 

Dear Friends, well wishers & my #AnbaanaFans 

Heartfelt thanks for the outpouring get well soon msgs.. feeling much better.. always grateful for all your love :) అంటూ సూర్య సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. 

Suriya on his injury:

Suriya reacts on his injury in Kanguva sets

Tags:   SURIYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ