హీరో అవుదామని వచ్చి సిల్వర్ స్క్రీన్ పై వెలిగిపోదామనుకున్న మానస్ నాగులపల్లిని బుల్లితెర ఆదుకుంది. బుల్లితెరపై సీరియల్ నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన మానస్ బిగ్ బాస్ సీజన్ 5 తో బాగా ఫేమస్ అయ్యాడు. ఆ సీజన్ లో సన్నీతో ఫ్రెండ్ షిప్ చేసి టాప్ 3 వరకు వెళ్ళిన మానస్ హౌస్ నుంచి బయటికొచ్చాక స్టార్ మా లో బ్రహ్మముడి సీరియల్ లో హీరోగా నటిస్తున్నాడు. ఈమధ్యనే మానస్ చెన్నై కి చెందిన శ్రీజ తో నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఆ తర్వాత స్టార్ మా ఈవెంట్స్ లో కాబోయే భార్యతో కలిసి కనిపించాడు.
ఇక నిన్న బుధవారం మానస్ శ్రీజ తో కలిసి ఏడడుగులు వేసాడు. గత రెండు రోజులుగా మానస్ పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. హల్దీ ఫంక్షన్, పెళ్లి కొడుకు ఫంక్షన్, మెహిందీ, సంగీత్ సెలెబ్రేషన్స్ లో మనస్-శ్రీజలు, వాళ్ళ స్నేహితులు బంధువులతో కలిసి సందడి చేశారు. మానస్-శ్రీజల వివాహానికి సంబందించిన వేడుకలన్నీ విజయవాడలోని ఓ రిసార్ట్స్ లో జరిగాయి. మానస్-శ్రీజలు.. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మధ్యన ఏడడుగులు వేసి పవిత్ర బంధంలోకి అడుగుపెట్టారు.
మానస్-శ్రీజల వివాహానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈకొత్త జంటకి సీరియల్ నటులు, ఇంకా స్నేహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.