Advertisementt

షూటింగ్ లో హీరో సూర్యకి ప్రమాదం

Thu 23rd Nov 2023 01:34 PM
suriya  షూటింగ్ లో హీరో సూర్యకి ప్రమాదం
Suriya gets injured షూటింగ్ లో హీరో సూర్యకి ప్రమాదం
Advertisement
Ads by CJ

తమిళ స్టార్ హీరో సూర్య ప్రమాదానికి గురయ్యారు. షూటింగ్ సెట్స్ లో సూర్య ఈ ప్రమాదానికి గురవ్వగా చిత్ర బృందం ఆయన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సూర్య ప్రస్తుతం కంగువ అనే ప్యాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. కంగువ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. షూటింగ్ లో భాగంగా ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా కెమెరా సూర్య మీద పడి ఆయనకి గాయాలైనట్టుగా తెలుస్తోంది.

కెమెరా మీదపడటంతో సూర్య భుజానికి గాయం అయ్యింది. వెంటనే అప్రమత్తం అయిన చిత్రయూనిట్ గాయపడిన సూర్యను స్థానిక ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య కి పెద్దగా ప్రమాదం లేదు అని, సూర్యకి ప్రమాదం జరిగిన తర్వాత షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసినట్లుగా సమాచారం. సూర్య ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. అయితే సూర్యకి పెద్దగా ప్రమాదం జరగలేదని, ఆయన కొద్దిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్స్ చెప్పడంతో ఆయన అభిమానులు ఊపిరి తీసుకుంటున్నారు.

Suriya gets injured :

Suriya gets injured on the sets of Kanguva

Tags:   SURIYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ