Advertisementt

ఫారిన్ షెడ్యూల్ ప్లానింగ్ లో గుంటూరు కారం

Thu 23rd Nov 2023 08:38 AM
guntur kaaram  ఫారిన్ షెడ్యూల్ ప్లానింగ్ లో గుంటూరు కారం
Exciting update on Guntur Kaaram ఫారిన్ షెడ్యూల్ ప్లానింగ్ లో గుంటూరు కారం
Advertisement
Ads by CJ

గుంటూరు కారం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఇప్పటికే గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా తో మహేష్ ఫాన్స్ పండగ చేసుకుంటుంటే నిర్మాత నాగ వంశి గుంటూరు కారం సెకండ్ సింగిల్ పై ఇచ్చిన అప్ డేట్ తో వారు మరింతగా సంబరాలు మొదలు పెట్టారు. అటు ప్రమోషన్స్ ఇటు షూటింగ్ తో త్రివిక్రమ్ కూడా బిజీ బిజీగా గడుపుతున్నారు. పెట్టుకున్న టార్గెట్ కల్లా గుంటూరు కారం షూటింగ్ పూర్తి చేసే పనిలో మహేష్-త్రివిక్రమ్ కసిగా కనిపిస్తున్నారంటున్నారు.

డిసెంబర్ 15 వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే గుంటూరు కారం షూటింగ్ జరిపి తదుపరి ఫైనల్ షెడ్యూల్ అంటే పాటల చిత్రీకరణ కోసం గుంటూరు కారం టీమ్ ఓ ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. సాంగ్స్ చిత్రీకరణ కోసం గుంటూరు కారం మేకర్స్ విదేశీ లొకేషన్స్ నే ఎంచుకుంటున్నారట. ఇక వచ్చే సెకండ్ సింగిల్ లో మహేష్-శ్రీలీల కలిసి ఉన్న డ్యూయెట్ ని వదలబోతున్నట్లుగా తెలుస్తుంది.

మహేష్ సరసన శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా, మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ చిత్రంలో జగపతి బాబు స్టైలిష్ విలన్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రం కోసం జగపతి బాబు కొత్తగా మేకోవర్ అయ్యారనే న్యూస్ వినిపిస్తుంది.  

Exciting update on Guntur Kaaram:

Guntur Kaaram shooting update

Tags:   GUNTUR KAARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ