హీరో నాని లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న. డిసెంబర్ 7 న విడుదలవుతున్న ఈ చిత్రంపై ట్రేడ్ లోనే కాదు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలున్నాయి. ప్యాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ నాని ఎప్పుడో మొదలు పెట్టేసాడు. నాని కూతురు పాత్రలో కనిపించిన పాప కియారా కన్నా తో కలిసి నాని సినిమాని ముంబై నుంచి హైదరాబాద్ వరకు బాగా ప్రమోట్ చేసుకుంటూ వచ్చాడు. హాయ్ నాన్న ప్రమోషన్స్ తోనే సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం సెన్సార్ కంప్లీట్ అయినట్లుగా తెలుస్తుంది.
ఈరోజు బుధవారం ప్రసాద్ ల్యాబ్ లో సెన్సార్ సభ్యుల కోసం హాయ్ నాన్న స్పెషల్ షో వేయగా.. ఈ చిత్రాన్ని చూసి ఓ సెన్సార్ మెంబెర్ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం ఉంది. సినిమాలో అంతగా సెంటిమెంట్ ఉంది.. నాని తో పాపకి ఉన్న సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి కంటతడి పెట్టడమే కాకుండా అందరిని కదిలించేవిలా ఉన్నాయట. మృణాల్ ఠాకూర్ గ్లామర్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవడం ఖాయం.
ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. మరి ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే నాని సినిమాలలో ఇప్పుడు హాయ్ నాన్న కూడా చేరినట్టే కనిపిస్తుంది. ఇక ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్ కి కూడా నచ్చేస్తుంది అనే నమ్మకంతో చిత్ర బృదం కనిపిస్తుంది.