Advertisementt

నాగ చైతన్య తండేల్ ఫస్ట్ లుక్

Wed 22nd Nov 2023 04:14 PM
naga chaitanya  నాగ చైతన్య తండేల్ ఫస్ట్ లుక్
Thandel First Look Unleashed నాగ చైతన్య తండేల్ ఫస్ట్ లుక్
Advertisement
Ads by CJ

యువ సామ్రాట్ నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటిల క్రేజీ ప్రాజెక్ట్ #NC23 గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. వెర్సటైల్ యాక్టర్ నాగ చైతన్య, కార్తికేయ 2తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు చందూ మొండేటి, అనేక హిట్స్ ని అందించిన ఇండియా లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ కలసి చేస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. మునుపెన్నడూ చూడని అవతార్‌లో కనిపించనున్న నాగ చైతన్యకు #NC23 హయ్యస్ట్ బడ్జెట్ మూవీ.

రేపు నాగ చైతన్య పుట్టినరోజు జరుపుకోనున్నారు. అతని పుట్టినరోజుకు ఒక రోజు ముందు మేకర్స్ పెద్ద ట్రీట్ అందించారు.  #NC23కు తండేల్ అనే పవర్ ఫుల్ టైటిల్ ని అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ని  లాంచ్ చేసారు మేకర్స్.తండేల్ అంటే  శక్తివంతమైన, ఆకర్షణీయమైన, ఏకాగ్రత అని అర్ధం. ఒక వ్యక్తికి నిజమైన ప్యాషన్ వుంటే దాని కోసం ఏదైనా చేయగల సంకల్పం వుండటం.

నాగ చైతన్య ఈ చిత్రంలో మత్స్యకారునిగా నటించడానికి బీస్ట్ మోడ్‌కి మారారు. కండలు తిరిగి దేహం కోసం గత కొన్ని నెలలుగా చాలా హార్ట్ వర్క్ చేశారు. ఫస్ట్ లుక్ లో పొడవాటి జుట్టు,  గడ్డంతో రగ్గడ్ లుక్ లో కనిపించారు. చేతిలో ఓర్‌తో పడవపై కూర్చున్న నాగ చైతన్య ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో కండలు తిరిగిన దేహంతో ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లానే ఆకట్టుకునేలా ఉంది. సినిమా ఇంకా సెట్‌పైకి వెళ్లనప్పటికీ,  ఫస్ట్ లుక్ సినిమాపై చాలా ఆసక్తిని కలిగిస్తుంది.

యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఒరిజినల్ లొకేషన్లలోనే జరగనుంది. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా సాయి పల్లవి నటిస్తున్నారు. సూపర్‌హిట్ లవ్ స్టోరీ తర్వాత ఇది వారి రెండవ చిత్రం. తండేల్ కూడా పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ.

Thandel First Look Unleashed:

Allu Aravind Presents- Naga Chaitanya Akkineni, Chandoo Mondeti, Bunny Vasu, Geetha Arts- Thandel First Look Unleashed

Tags:   NAGA CHAITANYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ