Advertisementt

జబర్దస్త్: జెడ్జెస్ vs కమెడియన్ భాస్కర్

Wed 22nd Nov 2023 01:54 PM
extra jabardasth  జబర్దస్త్: జెడ్జెస్ vs కమెడియన్ భాస్కర్
Jabardasth: Judges vs Bullet Bhaskar జబర్దస్త్: జెడ్జెస్ vs కమెడియన్ భాస్కర్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఈటీవీలో గురు, శుక్రవారాల్లో రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్డస్ట్ అంటే ఒకప్పుడు కామెడీ ప్రియులకి పిచ్చ క్రేజ్ ఉండేది. కానీ కొన్నాళ్లుగా జబర్దస్త్ నుంచి టాప్ కమెడియన్స్ వెళ్లిపోతున్నారు. ఆఖరికి గ్లామర్ భామ అనసూయ కూడా జబర్డస్త్ స్టేజ్ పై కనిపించడం లేదు. అటు జబర్దస్త్ టీఆర్పీ కూడా తగ్గిపోతూ రావడంతో జబర్దస్త్ గ్రాఫ్ పడిపోతుంది. పలు ఛానల్స్ లో ఎన్నిరకాల ప్రోగ్రామ్స్ వచ్చినా జబర్దస్త్ కామెడీ షో మాత్రం ఎప్పటికి రారాజులానే కనిపించేది. కానీ కమెడియస్న్, కామెడీ రెండూ మిస్ అవడంతో దానిపై క్రేజ్ కూడా తగ్గిపోతూ వస్తుంది.

అందుకే జబర్దస్త్ పై మళ్ళీ క్రేజ్ పెంచేందుకు రకరకాలుగా ప్రయత్నం చేస్తుంది యాజమాన్యం. ఈ వారం ఎపిసోడ్ లో ఏదో ప్లాన్ చేసారు. అందులో భాగంగా బులెట్ భాస్కర్ తో జెడ్జెస్ ఏదో గొడవ పెట్టుకున్నట్టుగా ప్రోమో వదిలారు. భాస్కర్.. గోపీచంద్ పెద్దమ్మ తల్లి దగ్గరకి వెళ్ళినప్పుడు గుండు చేయించుకుని కనబడతాడు అనగానే.. భాస్కర్ ముందే చెప్పాలి సర్ మధ్యలో గుండు సెటప్ రాదు అన్నాడు. దానికి ఖుష్బూ స్పూఫ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా చెయ్యాలిగా అన్నారు,

దానితో భాస్కర్ సీరియస్ గా తీసుకుని మీరు గుండు అన్నారు కాబట్టి 100 పర్సెంట్ గుండులోనే చూపిస్తా అంటూ జబర్దస్త్ స్టేజ్ పైనే గుండు చేయించుకున్నాడు. దానితో అక్కడున్నవారంతా షాకయ్యారు. ఇప్పుడు ఓకేనా సర్ అన్నాడు భాస్కర్. మేము అలా ఉంటే బావుంటుంది అన్నం కానీ, గుండు చేయించుకోమని చెప్పలేదు, సరదాగా అంటే గుండు చేయించుకున్నావ్ అని జెడ్జ్ కృష్ణభగవాన్ అడిగారు. దానికి భాస్కర్ గుండు చేయించుకోకముందు చెప్పాలి, అంతా అయ్యిపోయాక బొచ్చు రాదు అన్నాడు. దానికి కృష్ణభగవాన్ కి, ఖుష్బూ కి కోపమొచ్చింది.

ఆ తర్వాత ఖుష్బూ మనకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అందుకే ఈ జెడ్జ్ సీట్ లో ఉన్నాము, ఇక్కడ ఉన్నప్పుడు ఒక్క కామెంట్ కూడా ఇవ్వడానికి ఫ్రీడమ్ లేదంటే నేను ఈ ప్లేస్ లో ఎందుకుండాలి అనగానే భాస్కర్ ఏదో మట్లాడబోతే నేను మీతో మాట్లాడం లేదు అంటూ కృష్ణభగవాన్, ఖుష్బూ వాకౌట్ చేసి వెళ్ళిపోతున్న ప్రోమో వదిలారు. అది చూసాక బులెట్ భాస్కర్ vs జెడ్జెస్ ఏమైందో అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

Jabardasth: Judges vs Bullet Bhaskar:

Extra Jabardasth: Krishna Bhagavan and Khushboo vs Bullet Bhaskar

Tags:   EXTRA JABARDASTH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ