నాలుగు పదుల వయసులోనూ అనసూయ భరద్వాజ్ తన గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గదు. హీరోయిన్స్ కి మించిన అందం, గ్లామర్ ఆమె సొంతం. అందుకే పెళ్ళై, పిల్లలున్నా అనసూయ మాత్రం వెండితెర మీద వెలిగిపోతూ క్రేజీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. తాను పార్టీలకి దూరం కాబట్టే తనకి హీరోయిన్ అవకాశాలు రాలేదు అంటూ చెప్పిన అనసూయ తనకి హీరోలు లైన్ వేస్తారని వారిని అవాయిడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయంటూ ఈ మధ్యన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
ఇక పుష్ప తర్వాత మళ్ళీ అంతటి విజయం కోసం అనసూయ వెయిట్ చెయ్యని క్షణం లేదు. కానీ ఆమెకి అడుగడుగనా డిజాస్టర్స్ వెంటాడుతున్నాయి. రీసెంట్ గా పెద్దకాపు 1 ఆమెకి బిగ్ షాకిచ్చింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ తో రచ్చ మాత్రం మానలేదు. రిబ్బన్ కటింగ్స్ తో షాప్ ఓపెనింగ్స్ అంటూ హడావిడి చేస్తూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో అనసూయ పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే ఏమిటి అనసూయ ఈ రచ్చ అంటారు.
డార్క్ కలర్ శారీ లో అనసూయ హొయలు పోతూ గ్లామర్ చూపిస్తూ కనిపించిన తీరుకి అమ్మో అనసూయ నువ్వు ఏ మాత్రం తగ్గవే.. గ్లామర్ చూపించడానికి ఎన్ని దారులైన వెతుకుతావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.