అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడో ప్రతిసారి చూస్తూనే ఉన్నాము. షూటింగ్స్ లేనప్పుడు భార్య స్నేహ, పిల్లలు అర్హా, ఆయన్ లతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చెయ్యడానికి వెకేషన్స్ కి వెళ్లడమే కాదు.. అప్పుడప్పుడు సరదాగా నైట్ టైమ్ పిల్లలతో క్రేజీగా సిటీలో తిరుగుతూ కనిపిస్తాడు. ఇక కూతురు అర్హ తో చేసే అల్లరిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ రోజు అల్లు అర్హ పుట్టిన రోజు. అర్హ బర్త్ డే రోజున తన కూతురుతో ఆడుకుంటూ సరదాగా గడిపిన క్షణాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. My Bundle of Joy #alluarha అంటూ ట్వీట్ చేసాడు.
వరుణ్ తేజ్ పెళ్ళిలో కూతురుతో కలిసి సందడి చేసిన పిక్స్ ని పోస్ట్ చేస్తూ.. My Joy #alluarha అంటూ క్యాప్షన్ పెట్టాడు, ఈ ఫోటో తో పాటుగా అర్హతో అర్జున్ క్యూట్ గా ఆడుకుంటున్న వీడియో వైరల్ గా మారింది. ఇంట్లో కూడా అల్లు అర్జున్ తన పిల్లలతో గడిపే క్షణాలను స్నేహ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకి ట్రీట్ ఇస్తూ ఉంటుంది.