బిగ్ బాస్ సీజన్ 7 లో మొదటి నుంచి శివాజీ కి ఎందుకో శోభా శెట్టి అయినా మరో అమ్మాయి ప్రియాంక అన్నా పడదు. ఎందుకంటే వారిద్దరూ శివాజీ సలహాలు తీసుకోరో.. ఏమో శివాజీకి ఆ అమ్మాయిలంటే అసలు ఇష్టం ఉండదు. ఆయన తన చుట్టూ ఉండే యావర్, ప్రశాంత్ తో పాటుగా మధ్యలో తన శిష్యరికంలోకి లాగాలని చాలామందిని ట్రై చేసాడు. ఇక శివాజీ నామినేషన్స్ లో ఎవవరినైనా హార్ట్ అవ్వకుండా నామినేట్ చేసినట్లుగా కనిపిస్తాడు. కాని అంతలోనే అసహనం హౌస్ లో చాలాసార్లు బయటపెట్టాడు. ఏది ఏమైనా శివాజీ మైండ్ గేమ్ చాలామందికి నచ్చుతుంది. ఆడియన్స్ చూసుకుంటారు, వారే డిసైడ్ చేస్తారు అంటూ చెప్పే శివాజీ యావర్ ని, ప్రశాంత్ ని కంట్రోల్ లో పెట్టుకుంటాడనే మాట నెటిజెన్స్ నుంచి వినిపిస్తూనే ఉంది.
ఇక 12 వ వారంలో నామినేషన్స్ రచ్చ మాములుగా లేదు. అమర్ రతికని నామినేట్ చెయ్యగా రతిక తిరిగి అమర్ ని నామినేట్ చేసింది. గౌతమ్ మాత్రం పల్లవిని, శివాజీని నామినేట్ చేస్తూ రచ్చ చేసాడు. ఇక ప్రియాంక శివాజీని నామినేట్ చెయ్యగానే శివాజీ ఆ అమ్మాయిపై ఫైర్ అయ్యాడు. నిన్ను నీ రంగులని మొదటి నుంచి చూస్తున్నాను అంటూ ఆమెని అరిచాడు. నువ్వెంత వాదించినా నువ్వే గట్టిగా మాట్లాడావ్ ఆ రోజు అన్నాడు శివాజీ, సేఫ్ గేమ్ ఎవ్వరు ఆడుతున్నారో నాకు తెలుసు అన్నది ప్రియాంక. నువ్వు తెలివి కలదానివి, స్మార్ట్, నీ దగ్గర డిపెండ్ చేసుకోను నీ రంగులు చూపిస్తున్నావు, ఈ హౌస్ లో చాలా పొరపాట్లు జరుగుతున్నాయంటూ ప్రియాంకపై శివాజీ ఫైర్ అయ్యాడు.
గౌతమ్ ని కూడా యావర్ విషయంలో శివాజీ టార్గెట్ చేసాడు. ప్రియాంక విషయంలో ఒకలా.. యావర్ విషయంలో ఒకలా అంటూ శివాజీ గౌతమ్ ని నామినేట్ చేసాడు. నామినేషన్స్ తర్వాత ప్రియాంక నా మిస్టేక్ ఏమిటో చెప్పండి సర్ అంటూ శివాజీని అడిగింది. దానికి శివాజీ లేదమ్మా మీరెవరూ మారలేదు, మెచ్యురిటితో వచ్చేవి ఇవన్నీ అంటూ ప్రియాంకని అవాయిడ్ చేసాడు. ఇప్పటి నుంచి మళ్ళీ మొదలవుతాయి నా బూతులు అంటూ శివాజీ తన ముసుగుని మరోసారి తొలిగించాడు.