Advertisementt

త్రిష కి సపోర్ట్ గా మెగాస్టార్

Tue 21st Nov 2023 11:57 AM
trisha  త్రిష కి సపోర్ట్ గా మెగాస్టార్
I Support Trisha Says Chiranjeevi త్రిష కి సపోర్ట్ గా మెగాస్టార్
Advertisement
Ads by CJ

తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఈమధ్యన ఓ ఇంటర్వ్యూలో వెకిలిగా.. త్రిషపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ.. చాలా సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ తో స్పెషల్ సీన్స్ చేశాను. ఆ సీన్స్ అన్నిటిని నేను ఎంజాయ్ చేశాను. లియో సినిమాలో నన్ను సెలెక్ట్ చేసినప్పుడు త్రిషతో అలాంటి సీన్ ఉంటుంది అనుకున్నాను. కానీ లేనందుకు బాధపడ్డాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ త్రిష తీవ్రంగా స్పందిస్తూ.. దీనిని త్రీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలని ద్వేషిస్తున్నట్టు ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళతో కలిసి నాకు సినిమాలో సీన్స్ లేనందుకు నేను సంతోషిస్తున్నాను. నా తర్వాత సినిమాల్లో కూడా ఇతనితో కలిసి నటించకుండా ఉండేలా చూసుకుంటాను అంటూ ట్వీట్ చేసింది. త్రిషకు సపోర్ట్ గా లియో దర్శకుడు లోకేష్ కానగరాజ్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, హీరో నితిన్, మాళవిక, చిన్మయి.. ఇలా చాలామంది తమ గొంతు వినిపించారు. 

తాజాగా త్రిష పై  నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన  అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి X వేదికగా స్పందించారు. మన్సూర్  వ్యాఖ్యలు కేవలం ఆర్టిస్ట్‌కే కాకుండా ఏ స్త్రీ కైనా  అసహ్యాన్ని కలిగించేలా ఉన్నాయి. మన్సూర్  వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.. అతను వక్రబుద్ధితో కొట్టుమిట్టాడుతున్నాడు.. త్రిషకు మరియు అలాంటి భయంకరమైన వ్యాఖ్యలకు లోబడే ప్రతి స్త్రీకి నేను అండగా ఉంటాను.. అంటూ చిరు ట్వీట్ చేసారు.

చిరంజీవి, త్రిష స్టాలిన్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదంపై చిరు కూడా స్పందించడంతో.. ఈ ఇష్యు మరింత పెద్దగా మారింది.

I Support Trisha Says Chiranjeevi:

Megastar Extends His Support To Trisha

Tags:   TRISHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ