జబర్దస్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ అంటే కస్సున లేచే కిర్రాక్ ఆర్పీ ఇప్పడు చేపల పులుసు ఆర్పీగా మారిపోయాడు. నెలూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ కూకట్ పల్లిలో ఓ కర్రీ పాయింట్ ఓపెన్ చేసి యూటూబ్ చానల్స్ పుణ్యమా తెగ ఫేమస్ అయ్యాడు. జబర్దస్త్ కన్నా ఎక్కువగా చేపల పులుసుతో పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం కిర్రాక్ ఆర్పీ అంటే కేరాఫ్ నెల్లూరు పెదరెడ్డి చేపల పులుసుగా మారింది వ్యవహారం. హైదరాబాద్ లోనే పలు బ్రాంచ్ లని ఓపెన్ చేసిన ఆర్పీ ఇతర నగరాలు అంటే వైజాగ్, అనంతపురం ఇలా పలు నగరాల్లోనూ తన చేపల పులుసు టేస్ట్ చూపిస్తున్నాడు.
తాజాగా ఆర్పీ చేపల పులుసు తిరుపతికి పాకింది. తిరుపతిలోనూ తన నెల్లూరు టేస్ట్ అందుబాటులోకి తెచ్చాడు ఆర్పీ. పాస్ పోర్టు ఆఫీసు ఎదురుగా ఓ రెస్టారెంటు తెరిచారు. ఈ రెస్టారెంటును మినిస్టర్ రోజా, హీరోయిన్ మెహ్రీన్ కౌర్ అలాగే తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ఓపెన్ చేసారు. హైదరాబాద్ బ్రాంచ్ లని జబర్దస్త్ నటులు, సీరియల్ నటులతో ఓపెన్ చేయిచి పబ్లిసిటి చేసుకున్నాడు.
ఇంకా బెంగుళూరు, చెన్నై ఇలా చాలా ఏరియాలలో తన చేపల పులుసు అందుబాటులోకి రావడమే కాదు.. అమెరికాలోని ఈనెల్లూరు పెదరెడ్డి చేపల పులుసు అమ్ముతానంటూ ఎపుడో చెప్పిన ఆర్పీ.. ఇప్పుడు ఇలా చాలారకాల బ్రాంచ్ లని ఓపెన్ చేస్తూ చేతినిండా సంపాదిస్తున్నాడు.