ఆర్.ఆర్.ఆర్ విడుదలకు ముందే రామ్ చరణ్ సూపర్బ్ ప్లానింగ్ తో కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో జత కట్టాడు. ఆ చిత్రం మొదలైన కొద్దిరోజులకే శంకర్ తాను చెయ్యాల్సిన ఇండియన్ 2 షూటింగ్ ని మళ్ళీ మొదలు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు నిర్మాత దిల్ రాజు, రామ్ చరణ్ తో కలిసి మాట్లాడి శంకర్ ఇండియన్ 2 -గేమ్ ఛేంజర్ షూటింగ్ ని పారలల్ గా చేస్తున్నట్టుగా ఒప్పించి అలా 15 రోజులు ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ కి 15 రోజులు కేటాయిస్తున్నారు ఆయన.
ఎలాగో ఇప్పటికి ఇండియన్ 2 షూటింగ్ ఓ కొలిక్కి వస్తుంటే అటు గేమ్ ఛేంజర్ షూటింగ్ వెనుకబడిపోయింది. ఇంకా చరణ్ సమయం వృధా అవుతుంది. బుచ్చి బాబు మూవీ సెట్స్ లోకి వెళ్లలేక చరణ్ వెయిట్ చేస్తున్నాడు. శంకర్ కూడా గేమ్ ఛేంజర్ షెడ్యూల్స్ విషయంలో తికమకపడుతున్నారు. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో మిగతా నటుల డేట్స్ సెట్ చేసుకుని కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం ఆయనకి ఇప్పుడు తలనెప్పిగా మారిందట. ఈ విషయంలో చరణ్ కూడా విసుగ్గానే కనిపిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో టాక్ బయలుదేరింది.
దిల్ రాజు మీదున్న గౌరవం, ఆయనకి లాస్ రాకూడదని, అలాగే శంకర్ పై నమ్మకం ఉండడంతోనే రామ్ చరణ్ ఇంకా ఓపిగ్గా ఉన్నాడని, అందుకే తాజాగా చరణ్ కూడా శంకర్, దిల్ రాజు తో కలిసి కాస్త సీరియస్ గానే డిస్కర్స్ చేసి గేమ్ ఛేంజర్ షూటింగ్ వచ్చే ఫిబ్రవరి కల్లా పూర్తి చెయ్యమని డెడ్ లైన్ పెట్టాడంటున్నారు. ఫిబ్రవరికి పూర్తయితే చరణ్ బుచ్చిబాబు మూవీ సెట్స్ లోకి మార్చ్ లో జాయిన్ అయ్యే ప్లాన్ లో ఉన్నాడట. అందుకే శంకర్ కి రామ్ చరణ్ ఈ విషయమే చెప్పి త్వరగా పూర్తి చెయ్యమని కోరినట్లుగా తెలుస్తుంది. దానితో శంకర్ కూడా ఇరకాటంలో పడ్డారంటున్నారు.