కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ కి ఈ బర్త్ డే చాలా చాలా స్పెషల్. ఎందుకంటే గ్యాంగ్ లీడర్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక మోహన్ ఆ తర్వాత శర్వానంద్ తోనూ, సూర్య తోనూ ఇలా స్టార్ హీరోలతో జత కట్టింది. కానీ ప్రియాంక మోహన్ కి అనుకున్నంత పేరు రాలేదు. జస్ట్ యావరేజ్ మూవీస్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత పుట్టిన రోజులు కూడా అమ్మడుకు అంత స్పెషల్ గా అనిపించలేదు కానీ.. ఈ ఏడాది మాత్రం ఆమె తన పుట్టిన రోజుని ఎప్పటికి గుర్తుండిపోయేలా చేసింది.
ఎందుకంటే ప్రియాంకకి ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జత కట్టింది. సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG లో హీరోయిన్ గా ప్రియాంక ని సెలెక్ట్ చెయ్యడంతో ఆమె పేరు టాలీవుడ్ లో మోగిపోయింది. ఆమె అదృష్టానికి చాలామంది భామలు కుళ్ళుకున్నారు. అలా ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలోనూ తెగ ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు ప్రియాంక వైపు మరిన్ని స్టార్ చిత్రాల దర్శకుల చూపు పడింది.
ఇటు పవన్ లాంటి క్రేజీ హీరో సినిమాలో నటించడం. అటు మరిన్ని బిగ్ బడ్జెట్ మూవీస్ లో ఛాన్స్ లు రావడంతో ఈ ఏడాది ప్రియాంక బర్త్ డే నిజంగా స్పెషల్ గా మిగిలిపోయింది. OG నుంచి అమ్మడుకి విషెస్ కూడా అందాయి. ఇక ఈరోజు ఉదయం ఉంచే పవన్ ఫాన్స్ ప్రియాంక మోహనన్ హాష్ టాగ్ ని X లో ట్రెండ్ చేస్తూ ఆమెని హైలెట్ చేస్తున్నారు.