నిన్న ఆదివారం బిగ్ బాస్ లోకి నటుడు శ్రీకాంత్ వచ్చారు. తాను నటించిన కోట బొమ్మాళి PS మూవీ ప్రమోషన్స్ కోసం శ్రీకాంత్ తన టీమ్ తో కలిసి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. అయితే శ్రీకాంత్ కాలుకి పెద్ద బ్యాండేజ్ ఉంది. దానితో నాగార్జున శ్రీకాంత్ ఏంటి ఈ కాలు కి దెబ్బ అని అడగగానే. శ్రీకాంత్ ఇది దేవర షూటింగ్ లో జరిగింది అని చెప్పాడు. దానితో నాగార్జున ఏంటి.. తారక్ ఎమన్నా చేశాడా.. తారక్ వల్ల తగిలిందా అంటూ ఫన్నీగా అడిగారు..
శ్రీకాంత్ లేదు తారక్ వల్ల తగల్లేదు.. అక్కడ షూటింగ్ లో కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఇసుక దిబ్బలున్నాయి. దానితో కాలు నెప్పు పట్టింది. ఉదయం లేచేసరికి కాలు వాచింది. డాక్టర్ కి చూపిస్తే బ్యాండేజ్ వేశారు అంటూ శ్రీకాంత్ చెప్పాడు. ఇప్పుడు కూడా దేవర షూటింగ్ చేసే వస్తున్నాను, నిలబడి చేసేదే అంటూ శ్రీకాంత్ తన దెబ్బ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. శ్రీకాంత్ దేవర మూవీలో కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.