బిగ్ బాస్ సీజన్ 7 లో 11 వ వారం ఎలిమినేషన్ ని ఉల్టా పూల్టా చేసి ఎవరూ ఎలిమినేట్ అవకుండా స్కిప్ చేసారు. లేదంటే ఈ వారం శోభా శెట్టి లేదా రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యేవారు. కానీ అమ్మాయిలని కాపాడే క్రమంలో బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేషన్ ఎత్తేశాడనే మాట వినిపించింది. ఇక 12 వ వారం నామినేషన్స్ రచ్చ కూడా హౌస్ లో బాగానే జరిగినట్టుగా ప్రోమో వదిలారు. 12 వ వారం నామినేషన్స్ లో అమర్ దీప్ కి ప్రిన్స్ యావర్ కి మధ్యన పెద్ద గొడవే జరిగింది. మొదటి నుంచి ప్రిన్స్ యావర్ శోభా శెట్టిని లేదంటే అమర్ దీప్ ని టార్గెట్ చేస్తున్నాడు.
అలాగే గౌతమ్ కి పల్లవి ప్రశాంత్ మధ్యన కూడా ఫైట్ జరిగినట్టుగా చెబుతున్నారు. ఎప్పటిలాగే గౌతమ్ శివాజీ పైకి వెళ్ళాడు. మిగిలిన రతిక రోజ్, అశ్విని కూడా ఈ వారంలో నామినేట్ అయ్యారు. శోభా శెట్టికి ఒక ఓటు వచ్చిన కారణంగా ఆమె నామినేషన్స్ లోకి వెళ్ళలేదు. కెప్టెన్ గా ప్రియాంక సేవ్ అయ్యింది. అంటే ప్రియాంక, శోభా శెట్టి ఈ వారం సేఫ్ జోన్ లో ఉన్నట్లే. మరి గత వారం ఎలిమినేషన్ ఎత్తేసి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటున్నారు.
అంటే ఈవారం ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ వుంది. అందులో అమ్మాయిల్లో రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండగా.. అబ్బాయిల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేదాని మీద ఇప్పుడు అందరిలో ఆసక్తి బయలు దేరింది. ఒకవేళ శోభా శెట్టి గనక నామినేషన్స్ లో ఉంటే ఆమె, రతిక ఎలిమినేషన్ లోకి వెళ్లేవారు.