రీసెంట్‌గా రాములమ్మ.. అదే మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి బీజేపీ నుంచి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఆమె పార్టీ మార్పు గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. రెండు రోజుల క్రితమే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకుంది. పార్టీ మారిన ఆమె.. ఇప్పుడు కాంగ్రెస్‌లో కీలకంగా మారింది. అయితే రాములమ్మ పార్టీ మార్పులపై కొందరు కావాలని విమర్శలు చేస్తున్నారు. అలా విమర్శలు చేసే వారందరికీ సోషల్ మీడియా వేదికగా ఆమె కౌంటర్ సంధించింది.
రాములమ్మ పార్టీ మారారు అని విమర్శించే వాళ్ళు ఒక్కటి తెలుసుకోవాలి. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు 7 సంవత్సరాలు జెండా మోసి కొట్లాడింది నేను. నాడు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇంకొందరు బీజేపీ ప్రముఖులు అనేకసార్లు తమంత నా వద్దకు వచ్చి టిఆర్ఎస్ అవినీతిపై తప్పక చర్యలుంటాయి, మీరందరూ సమర్థిస్తే కేంద్రంలోని బీజేపీ ఎంతవరకైనా కొట్లాడతది అని చెప్పి నన్ను, వివేక్ వెంకటస్వామి గారిని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఒప్పించి, అందుకు కేంద్ర పెద్దలతో హామీ ఇప్పించి చేర్చుకున్నది నిజం కాదా...?
రాష్ట్రంలోని దుర్మార్గ పాలన పోవాలి, మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుంటే చాలు అన్న ఒకే ఒక్క కారణంతో సంవత్సరాలుగా పనిచేసిన కాంగ్రెస్‌ను వదిలి బిజేపికి వెళితే మాట నిలబెట్టుకోక మమ్మల్ని మోసగించి బీఆర్ఎస్‌తో బీజేపీ అవగాహన పెట్టుకున్నది తెలిసి కదా ఇంతమంది నాయకులు రాజీనామాలు చేసి బయటకెల్లింది..? విమర్శ తేలిక.. ఆత్మ పరిశీలన అవసరం.. అంటూ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా తను పార్టీ మార్పుపై విమర్శలు చేస్తున్నవారికి కౌంటర్ ఇచ్చింది.