బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎలాంటి హైప్ లేకుండా అడుగుపెట్టి ఆ తర్వాత తన స్టామినా ప్రూవ్ చేసుకున్న ప్రిన్స్ యావర్ ఇప్పుడు టాప్ 5 లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. మొదటి రెండుమూడు వారాల్లో తన ఆటని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అంటూ గోల చేసిన యావర్.. ఆ తర్వాత అంటే రతిక వెళ్ళిపోయాక పూర్తిగా ఆటపై ఫోకస్ పెట్టాడు. అయితే మధ్యలో యావర్ ఆట చాలా బావుంది. కాని అమర్ దీప్‌ని, శోభా శెట్టిని శివాజీ కోసం టార్గెట్ చేయడంతో యావర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. గత రెండు వారాలుగా యావర్ ఆటలో వీకైపోయాడు.
అయితే గత వారం ఎవిక్షన్ పాస్ టాస్క్‌లో నాలుగు రౌండ్స్‌లో పోటీపడి యావర్ ఎవిక్షన్ ప్రీ పాస్ సొంతం చేసుకున్నాడు. అయితే వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఎవిక్షన్ ప్రీ పాస్ టాస్క్‌ల విషయంలో యావర్ ఆడిన ఆటని వీడియోస్ రూపంలో ప్లే చేశారు. ప్రిన్స్ యావర్ మిస్టేక్ చేసిన వీడియోలను చూసిన తర్వాత హౌస్ మేట్స్ అందరూ షాక్‌కు గురయ్యారు. అప్పుడు యావర్ నాగార్జునతో సర్ గెలవాలన్న ఉద్దేశంతో నేను మిస్టేక్ చేశాను. కానీ, కావాలని చేయలేదు. బాల్స్ టాస్కు మాత్రం నాకు అర్థం అవలేదు అంటూ చెప్పుకొచ్చాడు. దానితో నాగార్జున కూడా యావర్.. గెలవడం ముఖ్యమే కానీ.. అది ఎలా గెలిచామన్నది ఇంకా ముఖ్యం అంటూ గట్టిగానే చెప్పారు.
దానితో హర్ట్ అయిన యావర్ ఒకవేళ నేను ఎవిక్షన్ పాస్ తీసుకోడానికి అనర్హుడిని అనుకుంటే ఇది నాకు వద్దు సార్ అన్నాడు. దానికి నాగార్జున అది నేను కాదు.. నువ్వు చెప్పాలి యావర్ అన్నారు. అయితే ఇది నాకు వద్దు సార్ అన్నాడు. అప్పుడు నాగ్ ఇది హౌస్ మేట్స్ కూడా చెప్పాలంటూ యావర్ ఆటపై అభిప్రాయం అడిగారు. అమర్, శోభా, ప్రియాంకలు యావర్ తొండి ఆడాడు అంటూ చెయ్యి ఎత్తారు. చాలామంది ప్రిన్స్ ఆట బావుంది అన్నారు. అయినా కూడా నాకు ఈ పాస్ వద్దు అంటూ యావర్ అది తెలుసుకెళ్లి స్టోర్ రూమ్‌లో పెట్టారు. యావర్.. ఎవిక్షన్ పాస్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు అన్నారు నాగ్. అవును కానీ నాకు నా కేరెక్టర్ ముఖ్యమంటూ ప్రిన్స్ కాస్త అతి చేసినట్టుగా నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.