Advertisementt

వార్ 2లో ఎన్టీఆర్ హీరోయిన్ ఫిక్స్

Sun 19th Nov 2023 02:58 PM
jr ntr war2  వార్ 2లో ఎన్టీఆర్ హీరోయిన్ ఫిక్స్
Heroine Fixed for NTR in War 2 వార్ 2లో ఎన్టీఆర్ హీరోయిన్ ఫిక్స్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్‌లో బిజీగా వున్నాడు. కొరటాల శివ పక్కా ప్లానింగ్‌తో దేవర షూటింగ్‌ని చుట్టేస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా చిన్న బ్రేక్ కూడా తీసుకోకుండా దేవర షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఎంత త్వరగా దేవర షూటింగ్ ఓ కొలిక్కి వచ్చేస్తే.. ఆయన డెబ్యూ ఇవ్వాల్సిన బాలీవుడ్ ఫిల్మ్ వార్ 2 అంత త్వరగా షూటింగ్ మొదలైపోతుంది. హిందీలోకి వార్ 2‌తో ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోన్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో హ్రితిక్ రోషన్ హీరోగా మొదలు కాబోయే వార్ 2లో ఎన్టీఆర్ కీలక పాత్ర అంటే నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడనే టాక్ ఉంది.

ఈ చిత్రంలో హృతిక్‌కి ఎన్టీఆర్‌కి హీరోయిన్స్ లేకపోయినా.. ఓ ముగ్గురు హీరోయిన్స్ సినిమాలో కనిపిస్తారట. అందులో ఒకరు కియారా అద్వానీ‌గా చెబుతుంటే.. ఇప్పడు ఎన్టీఆర్ పాత్ర కోసం ముంబై హీరోయిన్‌ని సెలక్ట్ చేశారంటున్నారు. బంటీ ఔర్ బబ్లీ 2తో హిందీలోకి తెరంగేట్రం చేసి అదే ఏడాది స్టార్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్‌గా ఐఫా అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న శార్వరి వాఘ్ అనే ముంబై బ్యూటీ‌ని ఎన్టీఆర్ సరసన నటింపజేస్తున్నారట.

అయితే శార్వరి ఎన్ని అవకాశాలు వచ్చినా తొందరపడకుండా ఆచితూచి వ్యవహరిస్తోంది. వార్ 2లో ఛాన్స్ ఆఫర్ చేయగానే నో చెప్పడానికి కారణం ఏముంటుంది. అయితే అఫీషియల్‌గా ఇంకా ప్రకటించలేదు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అనౌన్స్‌మెంట్ రోజున నటీనటుల పేర్లు ప్రకటిస్తారని తెలుస్తోంది.

Heroine Fixed for NTR in War 2:

Sharvari Wagh Selected for Jr NTR

Tags:   JR NTR WAR2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ