Advertisementt

BB7: అమర్ ని చూసి నవ్వుకుంటున్న నెటిజెన్స్

Sat 18th Nov 2023 10:35 AM
bigg boss 7  BB7: అమర్ ని చూసి నవ్వుకుంటున్న నెటిజెన్స్
BB7: Netizens laughing at Amardeep BB7: అమర్ ని చూసి నవ్వుకుంటున్న నెటిజెన్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 లోకి టైటిల్ ఫెవరెట్ గా వచ్చిన సీరియల్ నటుడు అమరదీప్ ఇప్పుడు హౌస్ లో జోకర్ లా కనిపిస్తున్నాడు. మొదటి వారం ఓకె ఓకె అనిపించిన అమరదీప్ తర్వాత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తో నామినేషన్స్ లో గొడవపడ్డాడు. ఆ తర్వాత శివాజీకి టార్గెట్ గా మారాడు. అప్పటినుంచి అమరదీప్ ఆట మొత్తం గోవిందా.. టాస్క్ ఆడడం మానేసి అరుస్తూ హైలెట్ అయ్యాడు. ఆ తరవాత ప్రతి నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ కి దొరికిపోయాడు. అందరూ అమరదీప్ ఆడే విధానాన్ని తొండి అంటూ అతని ఆటని బయట పెడుతున్నారు. 

ఇక సీరియల్ ఫ్రెండ్స్ అయిన శోభా శెట్టి, ప్రియాంక అతన్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. శోభా కెప్టెన్సీ కోసం కష్టపడి ఆడిన అమరదీప్ ని నాగార్జున హీరోని చేసారు. ఆ తర్వాత వారం పర్వాలేదనిపించాడు. ఇక హౌస్ లో ఇప్పటివరకు కెప్టెన్ కూడా అవ్వని అమరదీప్ ఈ వారం కెప్టెన్సీ కోసం బాగానే కష్టపడి ఫైనల్ వరకు వచ్చాడు. కానీ ఫైనల్ టాస్క్ లో ఫ్రెండ్ ప్రియాంకతో కలిసి ఆడాల్సి వచ్చింది. ఆటలో గౌతమ్, రతిక అమర్ ని టార్గెట్ చెయ్యడంతో అమరదీప్ డిఫెండ్ చేసుకోవడం మానేసి అరిచేసాడు.

ఆ అరుపులు అలా ఇలా కాదు.. ఓ రేంజ్ లో అరుస్తూ కేకలు పెట్టి  హౌస్ మొత్తం షేక్ అయ్యేలా చేసాడు. మీకు దణ్ణం పెడతాను, అరే అపాండిరా అంటూ వాళ్ళని వేడుకున్నాడు. కానీ ప్రియాంక మాత్రం తనని ఎవరు టార్గెట్ చేసినా డిఫెండ్ చేసుకుంటూ చాలా ఓపిగ్గా ఆడుతూనే అమరదీప్ ని కూడా డిఫెండ్ చేసుకో ఏడవకు అంటూ ధైర్యాన్ని చెప్పింది. అమరదీప్ మాత్రం ఏడుస్తూ అరుస్తూ రచ్చ చేసాడు. అది చూసిన  అమరదీప్ ఏంట్రా బాబు ఇంత ఓవరేక్షన్ చేసాడు అంటూ నవ్వుకుంటున్నారు.

BB7: Netizens laughing at Amardeep:

Bigg Boss 7: Yesterday episode highlights

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ