Advertisementt

మ్యారేజ్ లైఫ్ విమర్శలపై అలియా క్లారిటీ

Sat 18th Nov 2023 09:39 AM
alia bhatt  మ్యారేజ్ లైఫ్ విమర్శలపై అలియా క్లారిటీ
Alia Clarity on married life criticism మ్యారేజ్ లైఫ్ విమర్శలపై అలియా క్లారిటీ
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గత ఏడాది రణబీర్ కపూర్ ని వివాహం చేసుకోవడం, అదే స్పీడుతో పాపకి జన్మనివ్వడం అన్నీ మీడియాలో పలు రకాల విమర్శలకి తావిచ్చాయి. అలియా భట్ ప్రెగ్నెంట్ అవడం వలనే రణబీర్ కపూర్ అలియా లు అంత అర్జెంటు గా పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రెగ్నెంట్ అవడం వలనే రిసెప్షన్ కూడా పెట్టలేదు, పెళ్లి అయిన రెండు నెలలకే ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసారు. ఆ ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన ఆరు నెలలకే బేబీ పుట్టేసింది.. ఇదంతా విచిత్రం అంటూ మట్లాడుకున్నారు.

ఈ విషయమై అలియా భట్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా అలియా భట్ కాఫి విత్ కరణ్ షోలో తన పెళ్లి జీవితంపై వచ్చిన విమర్శలపై స్పందించింది. సోషల్ మీడియా విపరీతంగా పాపులర్ అయ్యింది, ఇంటర్నెట్ కాలం ఇది, ప్రతి రోజు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. నేను సన్నబడడానికి, అలాగే తెల్లగా మారడానికి సర్జరీ చేయించుకున్నాను అని రూమర్స్ క్రియేట్ చేసారు. అంతేకాకుండా నా మ్యారేజ్ లైఫ్ ని కూడా చాలామంది విమర్శించారు. 

అప్పట్లో ఒకసారి రణబీర్ కపూర్ కి నేను లిప్ స్టిక్ వేసుకుంటే నచ్చదని చెప్పాను, వేసుకున్న వెంటనే తీసేయాలని చెబుతాడు అని చెప్పాను. ఆ విషయాన్ని అందరూ అపార్ధం చేసుకుని వేరు వేరుగా ఊహించుకుని.. రణబీర్ నన్ను టార్చర్ పెడుతున్నాడంటూ రాసారు. రణబీర్ మంచి వ్యక్తి , అతనిపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే బాధనిపిస్తుంది.. తప్పుగా అర్ధం చేసుకోవడం, కేవలం అవన్ని అపోహలే, అందుకే నేను పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చింది.

Alia Clarity on married life criticism:

Alia Bhatt on rumours about her marriage problems

Tags:   ALIA BHATT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ