బిగ్ బాస్ సీజన్ 7లో ఉల్టా పుల్టా అంటూ ఏవేవో జరుగుతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో మీకు తెలియదు అంటూ కన్ఫ్యూజన్‌లో పెడుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఆ ఉల్టా పుల్టాలో భాగంగానే వైల్డ్ కార్డ్ అంటూ నెల తర్వాత ఐదుగురు హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. అలాగే రతికా రోజ్ మూడు వారాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక టాస్క్ లు కూడా ఉల్టా పుల్టా అంటూ గజిబిజి చేస్తున్నారు. ఇక ఈ వారం హౌస్ మొత్తం నామినేషన్స్, అలాగే ఏవిక్షన్ పాస్ గురించిన పోటీ జరిగింది.
ఈ 11 వ వారంలో ప్రశాంత్, శివాజీ తప్ప హౌస్ మొత్తం అంటే ఎనిమిదిమంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. యావర్, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక, గౌతమ్, అర్జున్ అంబటి, అశ్విని, రతికా రోజ్ లు నామినేషన్స్‌లో ఉండగా.. అందులో రోజుకో ఇద్దరు డేంజర్ జోన్‌లో కనబడుతున్నారు. అంటే ఓటింగ్‌లోనూ ఉల్టా పుల్టా కనిపిస్తుంది. గత మూడు రోజులుగా ప్రియాంక, శోభా శెట్టిలు డేంజర్ జోన్ లో కనిపించగా.. ఈ వారం వారిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని భావించారు.
కానీ నిన్నటి నుంచి అమర్ దీప్ టాప్ పొజిషన్‌లో ఉంటే తర్వాతి స్థానాల్లో యావర్, అర్జున్ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ప్రియాంక, అశ్విని చేరారు. అయితే డేంజర్ జోన్ నుంచి శోభా శెట్టి తప్పించుకోలేకపోయింది, అక్కడ శోభతో పాటుగా రతికా రోజ్ ఉంది. మరి ఈవారం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే బిగ్ బాస్ నుంచి గ్లామర్ షో వెళ్ళిపోతుంది. అయితే ఎవిక్షన్ పాస్ గెలిచిన యావర్ రతిక కోసం అది వాడితే ఖచ్చితంగా ఈసారి శోభా ఎలిమినేట్ అవ్వాల్సిందే అంటున్నారు.