ఇటీవల వచ్చిన భగవంత్ కేసరి చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని తన సక్సెస్‌ఫుల్ ట్యాగ్‌ని కంటిన్యూ చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇప్పుడు సినిమాలు వదిలేసి రాజకీయాలలోకి వస్తున్నారా? అంటే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్ చూసి అవునని చెప్పక తప్పదు. ఎందుకంటే ఓ పొలిటికల్ లీడర్‌గా మేకప్ అయిన అనిల్ రావిపూడి.. సేమ్ టు సేమ్ వారిలానే దండం పెడుతున్నారు. దీంతో అంతా అనిల్ రావిపూడి పాలిటిక్స్‌లోకి వస్తున్నారనేలా కామెంట్స్ చేస్తున్నారు. అందులోనూ ఇది పొలిటికల్ సీజన్ కావడంతో.. నిజమేనేమో అని కూడా అంతా అనుకుంటున్నారు.
అయితే అనిల్ రావిపూడి అప్పుడప్పుడు సినిమాలలో కూడా కనిపిస్తుంటారు. అలా ఏదైనా సినిమాలో ఇలా పొలిటికల్ గెటప్‌లో దర్శనమివ్వబోతున్నారా? అనేలా కూడా కామెంట్స్ దర్శనమిస్తున్నాయి. కొందరేమో.. ఆయన తన తదుపరి సినిమా నిమిత్తం ఏమైనా హింట్ ఇవ్వడానికి ఇలా మేకోవర్ అయ్యారా? అని కూడా మాట్లాడుకుంటుండటం విశేషం. ఏది ఏమైనా ఒక్క గెటప్‌తో రకరకాల అనుమానాలు వచ్చేలా చేస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
అయితే పిక్‌తో పాటు ఓ వీడియో కూడా బయటికి వచ్చింది. ఈ వీడియో మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆయన సీక్రెట్‌గా సినిమా ఏమైనా డైరెక్ట్ చేస్తున్నారా? దానికి సంబంధించిన టీజరా.. లేదంటే అనిల్ రావిపూడి యాక్టింగ్ వైపు మొగ్గు చూపుతున్నారా అనేలా ఈ వీడియో ఉంది. చూడడానికి ఈ వీడియో చాలా గ్రాండ్‌గా ఉంది. ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
కెమెరాను చూస్తూ అనిల్ రావిపూడి గంభీరంగా మాట్లాడుతున్నారు. మేకింగ్‌కి సంబంధించిన సలహానిస్తున్నారు. ఈ వీడియోలో ఆయనొక రాజకీయ పార్టీ గురించి ప్రస్తావించారు. ఇది అందరిలో గందరగోళాన్ని కలిగిస్తూనే నెట్టింట యమా స్పీడ్‌గా స్ర్పెడ్ అవుతోంది. అసలీ వీడియో వెనుక ఉన్న రహస్యం ఏమై ఉంటుందా అని అంతా సెర్చ్ చేస్తున్నారు. అయితే, ఇంతకు ముందు ఆహా ఓటీటీలో ఓ కామెడీ షోకు జడ్జిగా ఆయన వ్యవహరించారు. అలాంటి ప్లాన్ ఏదైనా జరుగుతుందా? అనేది తెలియాలంటే.. కాస్త వెయిట్ చేయక తప్పదు.