మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తర్వాత హిట్ డైరెక్టర్ వసిష్ఠతో తన తదుపరి మూవీని మ్యూజిక్ సిట్టింగ్స్ తో మొదలు పెట్టారు. బింబిసార తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వసిష్ఠ మెగాస్టార్ తో జర్నీ స్టార్ట్ చేసాడు. ఈ చిత్రానికి విశ్వంభర అంటూ పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఈ నెల చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అనుకుంటున్న సమయంలో ఈ చిత్రం గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలని వసిష్ఠ బయటపెట్టాడు.
ఓ ఇంగ్లీష్ డైలీతో వసిష్ఠ మట్లాడుతూ.. నా చిన్న తనంలోనే మెగాస్టార్ నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా చూసి ఎంతో ఆశ్చర్యపోయానని, ఆ తర్వాత చిరు మళ్ళీ ఆ టైప్ అఫ్ మూవీ అంటే సోషియో ఫాంటసి మూవీని మెగాస్టార్ మళ్ళి చేయలేదని, ఆ తరవాత అంజి వచ్చినప్పటికీ అది పూర్తి స్థాయి ఫాంటసీ మూవీ కాదని అన్నాడు వసిష్ఠ. అందుకే ఎంతో అలోచించి పూర్తి స్థాయిలో తాను చెయ్యబోయే మూవీపై శ్రద్ద పెట్టినట్లుగా వెల్లడించాడు.
ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు తెలిపారు. దాదాపుగా డెబ్భై శాతానికి పైగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని, ఈ చిత్రం చిరంజీవి గారి ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ అందరికి నచ్చుతుంది అంటూ వసిష్ఠ విశ్వంభరపై ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు.