రవితేజ ఈమధ్యన వరస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. ధమాకా తర్వాత వాల్తేర్ వీరయ్య హిట్. ఆ తర్వాత వచ్చిన రావణాసుర అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక ఎన్నో అంచనాలు పెట్టుకున్న రవితేజ ఫస్ట్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ టైగర్ నాగేశ్వరావు రిజల్ట్ కూడా ఆయనకి నిరాశనే మిగిల్చింది. అక్టోబర్ 19 న విడుదలైన టైగర్ నాగేశ్వరావు ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. విజయ్ లియో, బాలకృష్ణ భగవంత్ కేసరి రెండు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో రవితేజ సినిమాని ఇబ్బంది పెట్టాయి.
టైగర్ నాగేశ్వరావు టాక్ తేడా కొట్టడంతో నిర్మాతకు ఆ సినిమా భారీగా నష్టాలొచ్చాయి. ఇక ఈ చిత్రం థియేటర్స్ లో ఫెయిల్ అవడంతో నెలతిరక్కుండానే ఓటిటిలోకి వచ్చేసింది. సినిమాపై ఉన్న నమ్మకమతో అమెజాన్ ప్రైమ్ టైగర్ ని భారీ డీల్ కి డిజిటల్ హక్కులని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది, మరి ఎప్పటిలాగే అమెజాన్ ప్రైమ్ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఓటిటిలో స్ట్రీమింగ్ చేసేసారు. నవంబర్ 17 నుంచి టైగర్ నాగేశ్వరావు ని అమెజాన్ ప్రైమ్ నుంచి సైలెంట్ గా స్ట్రీమింగ్ చెయ్యడంతో ఓటిటి ఆడియన్స్ షాకయ్యారు.
టైగర్ నాగేశ్వరావు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓటిటి ప్రేక్షకులకి అమెజాన్ ప్రైమ్ నుంచి అందుబాటులోకి వచ్చేసింది.