సీతారామం సినిమాతో సంప్రదాయానికి పెట్టింది పేరుగా కనిపించిన మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. గ్లామర్ విషయంలో తన నేటివిటీని అంటే బాలీవుడ్ హీరోయిన్స్ తలదన్నేలా తయారైంది. స్కిన్ షో విషయంలో పాప అస్సలు తగ్గడం లేదు. కొద్దిరోజులుగా మృణాల్ ఠాకూర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ కనిపిస్తుంది. రీసెంట్‌గా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఇచ్చిన దీవాళి పార్టీలో ఓ సింగర్‌తో క్లోజ్‌గా మూవ్ అవడం చూసి మృణాల్ ప్రేమలో ఉంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్త గుప్పుమంది.
మృణాల్ పాపులర్ సింగర్‌తో డేటింగ్‌లో ఉంది.. అందుకే అంత క్లోజ్‌గా మూవ్ అయ్యింది అంటూ కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక ఇక్కడ టాలీవుడ్‌లో మృణాల్ ఠాకూర్ నాని తో కలిసి చేసిన హాయ్ నాన్న మూవీ ప్రమోషన్స్‌లో గ్లామర్‌గా కనబడుతుంది. సినిమాలో కూడా గ్లామర్ బ్యూటీగానే కనిపించిన మృణాల్.. తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్‌లో మెరిసిపోయింది. లూజ్ హెయిర్‌తో మృణాల్ గ్లామర్‌గా కనిపించిన తీరుకు యూత్ ముచ్చటపడిపోతున్నారు.
బ్లాక్ లెహంగాలో క్లాసీగా కనిపించింది. ఆమె ఫేస్‌లో ఓ వెలుగు కనిపించింది అనేలా మొహం బ్రైట్‌గా వెలిగిపోయింది. ప్రస్తుతం మృణాల్ ఈ బ్లాక్ అవుట్ ఫిట్ పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి.