Advertisementt

పెళ్ళికొడుకుని పరిచయం చేసిన కార్తీక నాయర్

Wed 15th Nov 2023 07:35 PM
radha,karthika  పెళ్ళికొడుకుని పరిచయం చేసిన కార్తీక నాయర్
Karthika Nair Shares Her Fiancee పెళ్ళికొడుకుని పరిచయం చేసిన కార్తీక నాయర్
Advertisement
Ads by CJ

రంగం సినిమాతో హీరోయిన్ గా తెలుగు పేక్షకుల్లో చెరిగని ముద్ర వేసిన అలనాటి మేటి నటి రాధ కూతురు కార్తీక నాయర్.. ఆ తర్వాత చాలా సినిమాల్లోనూ ముఖ్యంగా ఎన్టీఆర్ తో దమ్ము సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. త్రిష తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న కార్తీకకి ఆ చిత్రం మాత్రం నిరాశనే మిగిల్చింది. ఆ చిత్రమే కాదు ఆమె తెలుగులో చేసిన ఏ చిత్రమూ ప్రేక్షకులని కట్టుకోలేదు. అటు తమిళనాట కూడా కార్తీక అనుకున్నంత సక్సెస్ సాధించకపోవడంతో ఆమె కొన్నేళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటుంది.

ఇప్పుడు కార్తీక నాయర్ పెళ్లికి సిద్ధమైంది. గత నెలలోనే ఈ భామ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు, ఫేస్ కనబడకుండా ఫోటోస్ షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఇప్పుడు తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది. రోహిత్‌ మేనన్‌ ని  కార్తీక నాయర్ పెళ్లి చేసుకోబోయేది అంటూ అతన్ని ఫొటోస్ తో సహా రివీల్ చేసింది. రోహిత్‌ మేనన్‌ తో సరదాగా చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోలు షేర్‌ చేసింది. 

ఆ పిక్స్ తో పాటుగా కార్తీక నాయర్ ఇలా రాసుకొచ్చింది.. నిన్ను కలవడం విధి, నిన్ను ఇష్టపడటం మ్యాజిక్, మన జీవన ప్రయాణం మొదలు పెట్టడానికి కౌంట్ డౌన్ ప్రారంభించా అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అతి త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.

Karthika Nair Shares Her Fiancee:

Wedding Bells Ringing For Radha Daughter Karthika

Tags:   RADHA, KARTHIKA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ