Advertisementt

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి డెహ్రాడూన్ రిసెప్షన్

Wed 15th Nov 2023 06:51 PM
varun tej,lavanya tripathi  వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి డెహ్రాడూన్ రిసెప్షన్
Varun Tej-Lavanya Tripathi Dehradun Reception details వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి డెహ్రాడూన్ రిసెప్షన్
Advertisement
Ads by CJ

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు నవంబర్ 1 న ఇటలీలో వివాహం చేసుకున్నారు. ఇటలీ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న ఈ జంట అక్కడ ఇటలీ లోని టుస్కనీ నగరంలోనే చిన్నపాటి రిసెప్షన్ ని కుటుంభ సభ్యుల మధ్యన కానిచ్చేశారు. ఇక నవంబర్ 5 న నాగబాబు హైదరాబాద్ లో టాలీవుడ్ ప్రముఖులకు మరో రిసెప్షన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. టాలీవుడ్ సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్లు హజరైన ఈ రిసెప్షన్ తర్వాత వరుణ్ తేజ్ వర్క్ లో బిజీ అయ్యాడు.

రీసెంట్ గా దీపావళి రోజు కొత్త కోడలితో నాగబాబు ఫ్యామిలీ దివాళి సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. కొత్త జంట టపాసులు కాలుస్తూ నాగబాబు ఇంట సందడి చేసారు. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు మూడోసారి రిసెప్షన్ చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ రిసెప్షన్ తర్వాతే వరుణ్ అత్తగారి ఊరు అయిన డెహ్రాడూన్ లో మరో రిసెప్షన్ ఉంటుంది అన్నారు. అది ఇప్పుడు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు బుధవారం లావణ్య-వరుణ్ తేజ్ లు డెహ్రడూన్ బయలుదేరి వెళ్లారు. వరుణ్ తేజ్ మొదటిసారిగా అత్తారింటికి పయనమయ్యాడు.

డెహ్రాడూన్ లో లావ‌ణ్య త‌ల్లిదండ్రులు గ్రాండ్ గా రిసెప్ష‌న్ ఏర్పాటు చేస్తున్నట్లు స‌మాచారం. డెహ్రాడూన్ లో రిసెప్ష‌న్ బంధువులు, స్నేహితు లు, స‌న్నిహితుల కోసం గ్రాండ్ గా వరుణ్ అత్తామామలు ఏర్పాటు చేసిన‌ట్లు సమాచారం. ఈ రిసెప్షన్ కోసం మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు ఆయన భార్య పద్మజ, నిహారిక హాజరవుతారని టాక్.

 

Varun Tej-Lavanya Tripathi Dehradun Reception details:

Varun Tej and Lavanya Tripathi head to Dehradun for their third reception!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ