మెహ్రీన్ కౌర్ ఇప్పుడు హిట్ కొసంఎదురు చూస్తున్నట్టుగా ఉంది ఆ పై ఫోటో చూస్తుంటే. నిజమే మెహ్రీన్ అచ్చం అలానే ఆకాశం వంక చూస్తూ ఉంది. మీడియం రేంజ్ హీరోలని దాటి స్టార్ ఛాన్సెస్ అందుకుందామని బరువు తగ్గి గ్లామర్ పెంచినా అమ్మడుకి మాత్రం ఆ స్టార్ హీరోల ఛాన్స్ లు కాదు.. ఇప్పుడు మీడియం హీరోల అవకాశాలు కూడా రావడం లేదు. ఎఫ్ 2, ఎఫ్ 3 లో భీభత్సమైన గ్లామర్ షో చేసినా మెహ్రీన్ కౌర్ కి అవకాశాలు, కాలమూ రెండూ కలిసి రావడం లేదు.
ప్రస్తుతం మెహ్రీన్ కౌర్ స్పార్క్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. స్పార్క్ రేపు శుక్రవారం విడుదల కాబోతుంది. ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న మెహ్రీన్ కౌర్ లుక్స్ విషయంలో సింప్లి సూపర్బ్ అన్న రేంజ్ లో హైలెట్ అవుతుంది. ఈ పై ఫోటో కూడా మెహ్రీన్ ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంలో తీసిన పిక్కే. ఆ పిక్ చూడడానికి క్యూట్ గా స్వీట్ గా ఉన్నా.. ప్రస్తుతం అమ్మడు పరిస్థితి చూసిన వారు మాత్రం అయ్యో అమ్మడు హిట్టు కోసం ఎంతగా ఎదురు చూస్తుందో అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరి మెహ్రీన్ కి ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ ని అందిస్తుందో.. జస్ట్ వెయిట్ అండ్ సి.