హీరో విశ్వక్ సేన్ షూటింగ్ చేస్టున్న సమయంలో ట్రక్ పై నుంచి జారిపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి మూవీ షూటింగ్ స్పాట్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ లో లారీ ట్రక్ పై నుంచి విశ్వక్ సేన్ దూకే ప్రయతంల్లో జారిపడిపోగా.. విశ్వక్ కి చిన్నపాటి గాయాలైనట్టుగా తెలుస్తుంది. అతను జారిపడిపోతున్న విజువల్స్ చూసి విశ్వక్ సేన్ కి ఏమైనా దెబ్బలు తగిలాయేమో అని ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు.
అయితే విశ్వక్ సేన్ యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా రౌడీలని కొట్టే క్రమంలో విశ్వక్ సేన్ పై నుంచి దూకి అక్కడ కింద వేసిన పరుపులపై పడాల్సి ఉంది. కానీ విశ్వక్ సేన్ చేజారి ట్రక్ మీదనుంచి పరుపుపై కాకుండా కిందకి జారిపడిపోయాడు. తృటిలో విశ్వక్ కి పెను ప్రమాదం తప్పినట్టుగా ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ క్షేమంగా ఉన్నట్లుగా, ఈ ప్రమాదం జరగగానే చిత్ర బృందం షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసినట్లుగా సమాచారం.