Advertisementt

BB7 : టాప్ 5 కోసం కొట్లాట

Wed 15th Nov 2023 03:18 PM
bigg boss telugu 7  BB7 : టాప్ 5 కోసం కొట్లాట
Bigg Boss Telugu 7: Race for Top 5 Begins! BB7 : టాప్ 5 కోసం కొట్లాట
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. ఇంకా మిగిలింది నాలుగు వారాలే. హౌస్ లో పదిమంది హౌస్ మేట్స్ ఉన్నారు. ఈ నాలుగు వారాల్లో ఇద్దరిని డబుల్ ఎలిమినేషన్ లో పంపించేస్తారనే టాక్ ఉంది. ఈ వారం నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్, కెప్టెన్ శివాజి తప్ప మిగతా వారంతా ఉన్నారు. అర్జున్, యావర్, అమరదీప్, గౌతమ్, శోభా శెట్టి, ప్రియాంక, అశ్విని, రతిక ఉన్నారు. మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చనే ఊహాగానాలైతే ఉన్నాయి. ఇక ఈ వారం నామినేషన్స్ పర్వం ముగియగానే టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో మీలో మీరు కొట్టుకుచావమన్నాడు బిగ్ బాస్.

దానికోసం అమర్, అర్జున్, రతిక, గౌతమ్, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, ప్రియాంక ఇలా అందరూ తగవు పడ్డారు. రతిక నేను 5th ప్లేస్ లో ఉండాలనుకుంటుంన్నాను అంది. అయితే చివరి స్థానాల్లో అర్జున్, శోభా శెట్టి, అమరదీప్, అశ్విని, రతికలు ఉండగా.. హౌస్ లో ఈరోజు ఎవిక్షన్ ప్రీ పాస్ టాస్క్ మొదలయ్యింది.

మరి టాప్ 5 స్థానాల కోసం కంటెస్టెంట్స్ మధ్యన జరిగిన గొడవలతో ఈ రోజు ప్రోమో కట్ చేసారు. అందులో రతిక ఎక్కువగా గొడవపడింది. అర్జున్ vs శోభా అన్న రేంజ్ లో గొడవైంది. మరి ఈ వారం ఎవిక్షన్ ప్రీ పాస్ గెలిచేదెవరో ఈ రోజు ఎపిసోడ్ లో తేలిపోతుందేమో చూద్దాం. 

Bigg Boss Telugu 7: Race for Top 5 Begins!:

Bigg Boss Telugu 7 Contestants Rankings

Tags:   BIGG BOSS TELUGU 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ