మహేష్ అభిమానులు గుంటూరు కారం నుంచి ఏ అప్ డేట్ వచ్చినా దానిని క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రీసెంట్ గా హీరో ఇంట్రడక్షన్ సాంగ్ రిలీజ్ చేసారు. అది అభిమానులనే కాస్త నిరాశపరిచినట్టుగా మాట్లాడుకున్నారు. అంటే అంచనాలకు తగినట్టుగా థమన్ మ్యూజిక్ లేదు, త్రివిక్రమ్ మార్క్ స్టయిల్ కనిపించలేదు అంటూ మాట్లాడారు. సరే అదలా ఉంటే.. గుంటూరు కారం షూటింగ్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు.. ఇది సంక్రాంతికి ఎలా రిలీజ్ అవుతుంది అన్నారు.
కానీ తాజా సమాచారం ప్రకారం గుంటూరు కారం షూటింగ్ కి సంబందించిన న్యూస్ బయటికి వచ్చింది. అది ఓ వారం టాకీ పార్ట్ తో పాటుగా నాలుగు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉందట.. మిగతా షూటింగ్ కూడా డిసెంబర్ 20 కల్లా కంప్లీట్ అవ్వొచ్చంటున్నారు. మరి డిసెంబర్ 20 కల్లా షూటింగ్ పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా ప్రమోషన్స్ కి 20 రోజుల సమయం సరిపోతుంది. అంటే గుంటూరు కారం ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే వస్తుంది.
అందుకే అనేది ఇది గుడ్ న్యూస్ అని. మరి ఈ వార్త విన్నాక మహేష్ ఫాన్స్ సంబరాలకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఇకపై మిగతా సాంగ్స్ ని కూడా సమయానుసారం వదులుతూ హైప్ క్రియేట్ చేయబోతున్నారట.