అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో క్రేజీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప ద రూల్ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక, ఫహద్ ఫాసిల్ ఇలా మొత్తం యూనిట్ కష్టపడుతుంది. వరుణ్ తేజ్ పెళ్లి, దివాళి సెలెబ్రేషన్స్ తో అల్లు అర్జున్ కాస్త బిజీ అయినా.. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ కి రెడీ అయ్యారు. ఇకపై ఏకధాటిగా షూటింగ్ కంప్లీట్ చేసే యోచనలో టీమ్ ఉంది.
అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్షర్ దేవిశ్రీ ప్రసాద్ పుష్ప మూవీపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పుష్ప 2లో హైస్ మామూలుగా ఉండవు.. సినిమాలోని ప్రతి సీన్ ఇంటర్వెల్ సీన్ అంత హై ఇస్తుంది. సుకుమార్ పుష్ప కథ చెప్తుంటే చాలా సార్లు చప్పట్లు కొట్టాం అంటూ దేవిశ్రీ ప్రసాద్ పుష్ప పై చేసిన కామెంట్స్ ఆ చిత్రంపై మరింతగా అంచనాలు పెరిగేలా చేసాయి.
ఇప్పటికే పుష్ప 2 లోని జాతర సీక్వెన్స్ సినిమాలో హైలెట్ అవ్వబోతుంది అనే న్యూస్ కి తోడు ఇప్పుడు దేవిశ్రీ ఇచ్చిన హైప్ కి అల్లు ఫాన్స్ ఊగిపోతున్నారు.