Advertisement
TDP Ads

వైసీపీ వర్సెస్ రేవంత్ రెడ్డి

Wed 15th Nov 2023 08:40 AM
ycp,revanth  వైసీపీ వర్సెస్ రేవంత్ రెడ్డి
YCP vs Revanth Reddy వైసీపీ వర్సెస్ రేవంత్ రెడ్డి
Advertisement

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎక్కడ దొరుకుతారా? అని చూస్తోంది వైసీపీ. అసలు వైసీపీకి రేవంత్‌కి ఏంటి సంబంధం అంటారా? ఏమీ లేదు.. ఒకప్పుడు టీడీపీలో రేవంత్ కీలకంగా వ్యవహరించడమే. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టి నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది వైసీపీ. మరి రేవంత్ అభిమానులు, టీ కాంగ్రెస్ కేడర్ ఊరుకుంటుందా? వైసీపీ తప్పులన్నింటినీ వెలికి తీసి మరీ బజారున పెడుతోంది. తెలంగాణలో పార్టీ జెండా పీకేసి.. పార్టీని నమ్ముకున్న వారందరినీ గాలికొదిలేసినా మీరా చెప్పొచ్చేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవడంలో చెల్లి తడబడితే కనీసం మద్దతు కూడా ఇవ్వలేని జగన్.. రేవంత్‌ని విమర్శిస్తూ పోస్టులు పెట్టిస్తారా? అంటూ మండిపడుతున్నారు. 

పుట్టిల్లు ఎంత కట్నం ఇచ్చింది?

కేవలం వైసీపీకి అనధికార మిత్రుడైన కేసీఆర్‌కి విజయానికి అడ్డుకునే సత్తా కలిగిన నేత అన్న ఒకే ఒక్క కారణంతో రేవంత్‌ను టార్గెట్ చేస్తున్నారని విమర్విస్తున్నారు. చంద్రబాబు తనకు పొలిటికల్‌గా లైఫ్ ఇచ్చారని.. టీడీపీ పుట్టినిల్లని.. కాంగ్రెస్ మెట్టినిల్లు అని రేవంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మెట్టింటి గౌరవాన్ని కాపాడేందుకు తాను ఏం చేయడానికైనా సిద్ధమన్నారు. అయితే కాంగ్రెస్‌ని పెళ్లాడినందుకు పుట్టినిల్లైనా టీడీపీ ఎంత కట్నం ఇచ్చింది? ఆ డబ్బుతోనే పీసీసీ సంపాదించుకున్నావా? ఇలా రకరకాలుగా రేవంత్‌కు వ్యతిరేకంగా వైసీపీ పోస్టులు పెడుతోంది. వైసీపీకి పుట్టిల్లే కాంగ్రెస్ పార్టీ అన్న విషయం మరిచారా? అంటూ రేవంత్ అభిమానులు జగన్ అండ్ కోపై ఫైర్ అవుతున్నారు. 

పుట్టింటి నుంచి ఎంత కొట్టుకొచ్చి పార్టీలు పెట్టారు?

పుట్టింటి (కాంగ్రెస్ పార్టీ)ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు దోచేసి దానితో పార్టీ పెట్టి సొంత రాష్ట్రంలో పుట్టింటిని నాశనం చేసిన మీరా రేవంత్‌ని విమర్శించేందంటూ ఏకి పారేస్తున్నారు. రేవంత్ ఎప్పుడూ తన పుట్టిల్లైన టీడీపీని కానీ, చంద్రబాబుని కానీ విమర్శించలేదని.. కానీ జగన్ మాత్రం తన పుట్టిల్లైన కాంగ్రెస్ పార్టీని అవసరాలు తీరాక సర్వనాశనం చేశాడని విమర్శిస్తున్నారు. అలాగే షర్మిలకు కూడా కాంగ్రెస్ పార్టీయే పుట్టిల్లని.. అలాంటి పుట్టింటిని కాదని.. సొంత పార్టీ పెట్టిందని.. ఆపై దానిని నడపలేక తిరిగి పుట్టింటి గడపను ఆశ్రయించి తిరిగి రేవంత్‌పైనే విమర్శలు చేస్తుందా? అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. అన్నాచెల్లెళ్లిద్దరూ ఒక్కటేనంటున్నారు. పుట్టింటి నుంచి ఎంత కొట్టుకొచ్చి మీ అన్నా చెల్లెల్లిద్దరూ పార్టీలు పెట్టారంటూ జగన్, షర్మిలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి జగన్‌కు అయితే దిమ్మతిరిగే కౌంటర్స్ ఇస్తున్నారు.

YCP vs Revanth Reddy:

YCP vs Revanth..Dimma Tirige counters

Tags:   YCP, REVANTH
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement