మెగాస్టార్ చిరంజీవి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. మెగాస్టార్ చిరు కాలు కదిపితే సిల్వర్ స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే. మెగా డాన్స్, బ్రేక్ డాన్స్ ని పరిచయం చేసిన మెగాస్టార్ ఇప్పటికి అదే జోష్ లో డాన్స్ చేస్తారు. రీ ఎంట్రీ ఇచ్చాక కూడా కష్టమైన స్టెప్స్ తో ఇప్పటికీ అదరగొట్టేస్తూ యంగ్ స్టార్స్ కి పోటీ ఇస్తూనే ఉంటారు. అయితే ఈమధ్యన మెగాస్టార్ చిరు మోకాలి ఆపరేషన్ చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్నారనేది తెలిసిన విషయమే.
అయితే తాజాగా మెగాస్టార్ చిరు ఇంట్లో దివాళి పార్టీ జరిగింది. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీస్ హాజరయ్యారు. అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్, తారక్, మహేష్ భార్యల సమేతంగా హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో మెగాస్టార్ చిరు జవాన్ టైటిల్ ట్రాక్ కి అదిరిపోయేలా స్టెప్స్ వేశారు. చిరు జపాన్ టైటిల్ ట్రాక్ కి వేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చాలా స్టయిల్ గా కూల్ గా మెగాస్టార్ వేసిన స్టెప్స్ చూసి మెగా ఫాన్స్ ఇక సంబరపడిపోతున్నారు.
గతంలో చిరంజీవి తన ఇంట్లో 80s పార్టీ ఇచ్చినప్పుడుకే కూడా చిరు సుహాసిని, రాధా, రాధికా తన సమకాలీన నటీమణులతో డాన్స్ స్టెప్స్ వేసిన వీడియోస్ ఎంతగా స్ప్రెడ్ అయ్యాయో.. ఇప్పుడు కూడా ఈ డాన్స్ వీడియో అంతే వైరల్ గా మారింది.