మెగా ఫ్యామిలిలో నిన్నగాక మొన్న నాగబాబు కొడుకు హీరో వరుణ్ తేజ్ వివాహం అంగరంగ వైభవంగా ఇటలీలో జరిగిపోయింది. వరుణ్ పెళ్ళిలో రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, అల్లు అర్జున్ అందరూ ఎంజాయ్ చేసారు. ఇక ఈ పెళ్ళిలో సాయి ధరమ్ తేజ్ పెళ్లి కొడుకుగా వరుణ్ తేజ్ వస్తున్న కారు మీద కాలేసి ఎంత పని చేసావ్ రా వరుణ్ బాబు, ఉష్ నీకు పెళ్ళిసంబరాలు, నాకేమో స్వతంత్ర పోరాటం అంటూ ఫన్నీగా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
అయితే సాయి ధరమ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం మూవీతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ అయ్యి 9ఏళ్లు పూర్తవడంతో సాయి ధరమ్ తేజ్ #AskSDT అంటూ అభిమానులతో సరాదాగా ముచ్చటిస్తున్నాడు. ఆ చిట్ చాట్ లో ఓ అభిమాని #BRO పెళ్లి ఎప్పుడు 🕵️ #AskSDT @IamSaiDharamTej #9YearsForSDTinTFI అంటూ ప్రశ్నిచాడు. దానికి సాయి ధరమ్ తేజ్ కూడా అంతే సరదాగా.. Neeku aina వెంటనే నీకు అయిన వెంటనే అంటూ ఫన్నీ పిక్ తో సమాధానమిచ్చాడు.
మరి చరణ్, వరుణ్ తర్వాత నెక్స్ట్ మెగా ఫ్యామిలిలో పెళ్ళికొడుకు అవ్వాల్సింది సాయి ధరమ్ తేజే కదా.. ఆ ముచ్చట ఎప్పుడు చెబుతాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.