మిల్కి బ్యూటీ తమన్నా పెళ్లి చేసుకోబోతుందా.. బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మని త్వరలోనే వివాహం చేసుకుకోబోతుందా.. ఇప్పుడిదే బాలీవుడ్ మీడియా నుంచి టాలీవుడ్ మీడియా వరకు జరుగుతున్న చర్చ. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం వరకు సీక్రెట్ రిలేషన్ ని మైంటైన్ చేసిన తమన్నా-విజయ్ వర్మలు ఇప్పుడు పబ్లిక్ గా తిరుగుతున్నారు. బాలీవుడ్ ఈవెంట్స్ కి జంటగా హాజరవుతున్నారు. అయితే తమన్నా తాము ఇంకొద్ది రోజులు ఈ రిలేషన్ లో కొనసాగాలని.. ఇప్పుడప్పుడే పెళ్లి గురించిన ఆలోచన లేదు అని చెబుతూ వస్తుంది.
కానీ గత ఫిబ్రవరిలోనే తమన్నా - విజయ్ వర్మలు వివాహం చేసుకోబోతున్నారనే న్యూస్ నడిచినా.. అది రూమర్ అని ఈ జంట కొట్టిపారేసింది. కానీ ఇప్పుడు తమన్నా కుటంబ సభ్యుల ఒత్తిడితో పెళ్ళికి సిద్దమవుతుంది అనే న్యూస్ బాగా స్ప్రెడ్ అయ్యింది. తమన్నా వయసు ఇప్పుడు 33, విజయ్ వర్మకు 37 ఏళ్ళు. ఈమధ్యన తమన్నా కుటుంబసభ్యులు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో వీరిద్దరూ పెళ్లికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తమన్నా-విజయ్ వర్మలు డిసెంబర్ చివరి వారం లేదా జనవరిలో నిశ్చితార్థం చేసుకుని.. వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారంటున్నారు. అయితే ఈ పెళ్లి విషయంపై తమన్నాకానీ, విజయ్ వర్మ కానీ అధికారికంగా స్పందించలేదు.