బిగ్ బాస్ సీజన్ 7 లో నామినేషన్స్ రచ్చ రెండురోజులు జరుగుతుంది. ఏ సీజన్ లో అయినా వారంలో సోమవారం ఒక్క రోజే నామినేషన్స్ ప్రక్రియ ఉండేది. కాని సీజన్ 7 లో నామినేషన్స్ ప్రక్రియ రెండు రోజుల పాటు సాగుతుంది. కంటెస్టెంట్స్ కొట్లాట తో బిగ్ బాస్ కూడా ఈ ప్రక్రియని రెండు రోజులు సాగదీస్తున్నాడు. ఇక నిన్న 11వ వారం నామినేషన్స్ లో రతిక ప్రియాంక, శోభా శెట్టిలని ఆడేసుకుంది. లాగింగ్ స్టార్ రతిక అంటూ కామెడీ చేస్తూనే శోభా శెట్టిని, ప్రియాంక ని ఏసుకుంది. ఎప్పుడూ శోభా, ప్రియాంక డామినేట్ చేసేవారు. కానీ శివాజీ డైరెక్షన్ లో ఈసారి రతిక రెచ్చిపోయింది.
అలాగే అర్జున్ పల్లవి ప్రశాంత్ కి మధ్యన నామినేషన్స్ గొడవ జరిగింది. ఈరోజు అయితే అమరదీప్-యావర్ మధ్యన రతిక విషయంలో జరిగిన రచ్చ చూస్తే ఇద్దరూ కొట్టేసుకుంటారేమో అనిపించేలా ప్రోమో కట్ చేసారు. యావర్-అమర్ ఇద్దరూ గొడవపడుతుంటే ఒకొనొక స్టేజ్ లో కలయపడతారా అన్నంత ఊపులో శివాజీ వాళ్ళిద్దరినీ వేరు చేసాడు. రతిక విషయంలో అమర్ యావర్ పై గొడవకి దిగాడు.
ఆ తర్వాత ఎప్పటిలాగే యావర్ కి శోభా శెట్టి కి మధ్యన పెద్ద గొడవ అయ్యింది. ఇక పల్లవి ప్రశాంత్ అర్జున్ ని నామినేట్ చేస్తూ మాట్లాడిన మాటలకి అర్జున్ కి బాగా కోపమొచ్చింది. ఆ తర్వాత అశ్విని తనపై పాట పాడిన అమర్ ని నామినేట్ చేసింది. ప్రస్తుతం హౌస్ లో నామినేషన్స్ రచ్చ ఎలా ఉందో జస్ట్ ప్రోమో రూపంలో వదిలారు.